हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Actor: అరుంధతి సినిమాలో అనుష్క భాగం అయ్యారు: బెల్లంకొండ శ్రీనివాస్

Anusha
Actor: అరుంధతి సినిమాలో అనుష్క భాగం అయ్యారు: బెల్లంకొండ శ్రీనివాస్

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం భైరవం మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాడు. మే 30న బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ చేసే విధ్వంసం ఏంటో అందరికీ తెలియనుంది. ఇది తమిళ సినిమా గరుడాన్‌(Garudan)కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీని తెలుగు వారికి తగ్గట్టుగా విజయ్ కనకమేడల మార్పులు చేర్పులు చేసినట్టుగా సమాచారం. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ముగ్గురు హీరోలు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు.బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన నెక్స్ట్ మూవీ నుంచి రాబోయే హైందవ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని చెబుతున్నాడు. అది దశావతారం కాన్సెప్టులో ఉంటుందట. ఆ మూవీని తన ఫ్రెండ్, కోడి రామకృష్ణ అల్లుడు మహేష్ ఆ సినిమాను తీస్తున్నాడని చెప్పుకొచ్చాడు.

స్పెషల్ ఫిల్మ్

అది తన మీద పెట్టే బడ్జెట్ కాదని, సినిమాని, కథని చూసి పెట్టాల్సి బడ్జెట్ అని అన్నాడు. ‘అప్పట్లో వాళ్లు అనుష్క మార్కెట్‌ను బట్టి అరుంధతి తీయలేదు అరుంధతి ప్రాజెక్టులో అనుష్క భాగం అయ్యారు.ఇప్పుడు కూడా ఇంతే హైందవ అనే మంచి కథలో నేను భాగం అవుతున్నాను,ఆ కథను నా వద్దకు తీసుకు వచ్చారు. పది ఎపిసోడ్స్‌గా ఆ కథను నా ఫ్రెండ్ మహేష్ అనుకున్నాడు, రెండున్నర గంటలు చెప్పాడు.అప్పటికే కథ విని స్పెల్ బౌండ్ అయ్యా నాకు కథ అద్భుతంగా నచ్చింది ఆల్రెడీ నలభై శాతం షూటింగ్ కూడా ఫినిష్ అయింది.ఆ మూవీకి ఎక్కువ వీఎఫ్ఎక్స్(VFX) అవసరం పడుతుంది.రెండు నెలలు వీఎఫ్ఎక్స్‌కే టైం కేటాయించాల్సి ఉంటుంది. నా కెరీర్‌లో ఇది చాలా స్పెషల్ ఫిల్మ్ అవుతుంది’ అంటూ ఇలా బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.

Actor: అరుంధతి  సినిమాలో అనుష్క భాగం అయ్యారు: బెల్లంకొండ శ్రీనివాస్

ఛాయలు

భైరవం మూవీని విజయ్ కనకమేడల తమిళం నుంచి తీసుకున్న సంగతి తెలిసిందే. గరుడాన్‌లోని మెయిన్ పాయింట్‌ను మాత్రమే తీసుకుని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మొత్తంగా మార్చేశారట. ఇది ఎక్కడా కూడా రీమేక్ అన్న ఛాయలు కనిపించవని, అంతా కొత్తగా ఉంటుందని అంటున్నారు. మరి ఈ మూవీతో అయినా ఈ ముగ్గురు హీరోలకు మంచి హిట్ దొరుకుతుందా? ఈ ముగ్గురూ కమ్ బ్యాక్ అవుతారా? అన్నది చూడాలి. మంచు మనోజ్‌కి అయితే ఇది కమ్ బ్యాక్ అన్న సంగతి తెలిసిందే.

Read Also : Tourist Family : ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ పై హీరో సూర్య ప్ర‌శంస‌ల జ‌ల్లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870