తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను నవ్వించే ప్రఖ్యాత కమెడియన్‌లు వైవా హర్ష (Harsha Chemudu), ప్రవీణ్ (Praveen) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘భకాసుర రెస్టారెంట్’. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. హారర్ కామెడీ జానర్‌లో వస్తున్న ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా హిలేరియస్‌గా ఉండబోతుందని తెలుస్తుంది.షైనింగ్ ఫణి (బమ్‌చిక్ బంటి), కేజీఎఫ్ గరుడ రామ్, కృష్ణభగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఉప్పెన జయకృష్న, వివేక్ దండు, అమర్, రామ్‌పటాస్, రమ్య, ప్రాచీ ఠాకూర్, జబర్థస్త్ అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: బాల సరస్వతి, ఎడిటర్: మార్తండ్.కె.వెంకటేష్, సంగీతం: వికాస్ బడిస, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినయ్ కొట్టి, ఆర్ట్ డైరెక్టర్: శ్రీ రాజా సీఆర్ తంగాల, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి, దర్శకత్వం: ఎస్‌జే శివ.
నవ్వించేలా
తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే, ఈ సినిమా హారర్ కామెడీ జానర్‌లో వచ్చే వినూత్న ప్రయోగంగా భావించవచ్చు. ట్రైలర్ ప్రారంభంలోనే ఒక రహస్యమైన రెస్టారెంట్‌ను చూపిస్తూ, అక్కడ జరిగే సంఘటనలతో కథ ప్రారంభమవుతుంది. కథలోని హాస్యభరితమైన డైలాగులు, భయపెట్టే పరిస్థుతుల మధ్య హీరోలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది హైలైట్(Highlight)గా నిలుస్తుంది.ట్రైలర్‌లో ప్రవీణ్, వైవా హర్ష మధ్య జరిగే చమత్కారమైన సంభాషణలు ప్రేక్షకులను నవ్వించేలా ఉన్నాయి. ముఖ్యంగా హార్షా ఛేముడుకు సహజమైన హాస్యశైలి, టైమింగ్ సినిమాకు ప్రాణం పోసేలా కనిపిస్తోంది. రెస్టారెంట్‌లో చోటుచేసుకునే భయానక సంఘటనలు, అక్కడ పనిచేసే వ్యక్తుల రహస్యాలు, వెనుక ఉన్న కథ ట్రైలర్‌లో అంతర్లీనంగా చూపించారు. కానీ అసలు కథ ఏమిటి అన్నది మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు.
Read Also : Anaganaga Movie: అనగనగా మూవీ రివ్యూ (ఈటీవీ విన్)