📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Baasha Movie: ఏప్రిల్ 25న బాషా సినిమా రీరిలీజ్

Author Icon By Anusha
Updated: April 20, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన రీ రిలీజ్ హంగామా కనిపిస్తుంది.టాలీవుడ్ లో మొదలైన ఈ ట్రెండ్ కోలీవుడ్, బాలీవుడ్ కు కూడా పాకింది. కాకపోతే మిగతా ఇండస్ట్రీలలో కంటే తెలుగులో జోరుగా సాగుతోంది. గతంలో హిట్టయిన స్టార్‌ హీరోల సినిమాలను మరోసారి వెండితెరపైకి తీసుకొస్తున్నారు. వీటికి ప్రేక్షకాదరణ లభిస్తుండటంతో ఇబ్బడిముబ్బడిగా రీరిలీజులను వదులుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే పలు ఎవర్‌ గ్రీన్, ఫీల్‌ గుడ్‌, క్లాసిక్, బ్లాక్ బస్టర్ చిత్రాలను విడుదల చేశారు. ఈ క్రమంలో కొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా మరోసారి థియేటర్లలో సందడి చేస్తున్నాయి.పరభాషా చిత్రాలను ఆదరించడానికి తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. కంటెంట్ నచ్చితే చాలు, భాషతో సంబంధం లేకుండా ఎగబడి చూస్తారు. రీరిలీజుల్లోనూ ఇదే కనిపిస్తోంది. ఇటీవల కాలంలో 3, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’, ‘యుగానికొక్కడు’ వంటి తమిళ డబ్బింగ్ సినిమాలను మరోసారి విడుదల చేస్తే అనూహ్య స్పందన లభించింది. దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘బాషా’ చిత్రాన్ని ఇప్పుడు రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు.

ఫిలిం మేకర్స్

రజనీకాంత్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలలో ‘బాషా’ ఒకటి. ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే’ అంటూ వచ్చిన ఈ సినిమా అప్పట్లో తమిళ చిత్ర సీమలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. సాధారణ జీవితం గడిపే హీరోకి ఎవరికీ తెలియని పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉండటం అనే లైన్ కి ఈ సినిమానే నాంది పలికింది. 1995లో రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికీ స్క్రీన్ ప్లేలో బాషా టెంప్లేట్ ని ఫాలో అవుతున్న ఫిలిం మేకర్స్ ని మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి క్లాసిక్ మూవీని మరోసారి బిగ్ స్క్రీన్ మీదకు తీసుకొస్తున్నారు.‘బాషా’ సినిమాని తెలుగులో ఏప్రిల్ 25న గ్రాండ్ గా రీరిలీజ్ చేయబోతున్నారు. అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా కూడా అదే సమయంలో విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఒకరోజు ముందుగా రజనీకాంత్ బాషా మూవీ రానుంది. ఇలా ఇద్దరు సూపర్ స్టార్ల హిట్ సినిమాలు ఒకేసారి రీరిలీజ్ అవుతుండటం ఆసక్తికరంగా మారింది. మరి ఈ రెండిటిలో ఏ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

విలన్

‘బాషా’ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో రజనీకాంత్ పక్కన నగ్మా హీరోయిన్ గా నటించింది. రఘువరన్ విలన్ గా నటించగా శరన్ రాజ్, విజయ్ కుమార్, శశి కుమార్, ఆనంద్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. దేవా ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు.

Read Also: Khauf Review : ‘ ఖౌఫ్’ సిరీస్ రివ్యూ!

#BaashaReRelease #BharatAneNenu #MassReReleases #SuperstarClash Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.