हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Avika Gore: ఘనంగా నటి అవికా గోర్ నిశ్చితార్థం

Anusha
Avika Gore: ఘనంగా నటి అవికా గోర్ నిశ్చితార్థం

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో ఎంతో మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించిన బాల నటిగా అవికా గోర్‌ గుర్తింపు పొందింది. ఆ తరువాత తెలుగులో ‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మామ’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె, తాజాగా తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది. బాలీవుడ్‌లో అడుగుపెట్టి, సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఈ అందాల తార, బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతూ తన ప్రియుడితో నిశ్చితార్థం జరుపుకుంది.తాజాగా అవికా గోర్ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా తన ప్రియుడు మిలింద్‌ చంద్వానీ(Milind Chandwani)తో కలిసి ఉంగరాలు మార్చుకుంది.అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘అతను నోరు తెరిచి అడగ్గానే ఆనందంతో ఏడ్చేశాను.

సాకారమైనట్లు

ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నట్లుగా అవును అంటూ గట్టిగా అరిచాను. పూర్తిగా సినిమాల్లో మునిగిపోయిన నాకు ఇప్పుడు మైండ్‌లో మంచి బీజీఎమ్‌ వినిపిస్తోంది. స్లో మోషన్‌లో మా కల సాకారమైనట్లు కనిపిస్తోంది. అతనేమో ప్రశాంతగా ఉన్నాడు, తెలివిగా కనిపిస్తున్నాడు. అయినా మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్. జంటగా బాగా ఫిట్టయ్యాం.ఎప్పుడైతే అతడు నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడో అప్పుడు నాలో ఉన్న హీరోయిన్‌ నన్ను పూర్తిగా ఆవహించింది. గాల్లో తేలిపోయా, కళ్లనిండా నీళ్లు, మెదడు ఆలోచించడమే మానేసినట్లు, ఇలా రకరకాలుగా అనిపించింది. నిజమైన ప్రేమంటే ఇదే నేమో, ప్రేమలో అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. కానీ అందులో ఉన్న మ్యాజిక్కే వేరు’ అని తెలిపింది.

శుభాకాంక్షలు

అవికాగోర్- మిలింద్ చంద్వానీ ఎంగేజ్ మెంట్ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ముంబైలో పుట్టిన అవికా గోర్‌(Avika Gore) పదేళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చింది. ‘బాలికా వధు’ (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘బ్రో’, ‘షణ్ముఖ’ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది.

Read Also: Trisha: సైలెంట్ఏ అతడి ప్రైడ్.. త్రిష కామెంట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870