కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రలో ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది.ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.తల్లి కొడుకుల అనుబంధం, యాక్షన్ ప్రధానంగా సాగిన ఈ సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈ సినిమా ఇటీవల రెంటల్ విధానంలో ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లోకి వచ్చిన విషయం తెలిసిందే.ఫ్రీగా అందుబాటులోకి తీసుకోచ్చారు. ప్రైమ్ చందదారులు ఈ సినిమాను ఉచితంగా చూడవచ్చు.
కథ ఏంటంటే
వైజయంతి (విజయశాంతి) అనే నిజాయితీగల ఐపీఎస్ అధికారిణి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు అర్జున్ (కళ్యాణ్ రామ్) అనే ఒకే ఒక్క కొడుకు ఉంటాడు. అర్జున్‌ను ఎలాగైనా ఐపీఎస్ అధికారిగా చూడాలనేది వైజయంతి యొక్క పెద్ద కల. దాని కోసం ఆమె అతన్ని ఐపీఎస్(IPS) చదివించి శిక్షణ కోసం ఢిల్లీకి పంపుతుంది. ఏడాది శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి రావాల్సిన అర్జున్, వెళ్లిన ఐదో రోజే తిరిగి వస్తాడు. అందుకు కారణం అతని తండ్రి మరణం. నావికాదళ అధికారి అయిన అతని తండ్రి సముద్రంలో జరిగిన ప్రమాదంలో మరణించాడని పోలీసులు చెబుతారు.అయితే నిజానికి అర్జున్ తండ్రి మరణానికి కారణం ప్రమాదం కాదు, అది ఒక హత్య. ఆ విషయం తెలుసుకున్న అర్జున్, తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. కానీ వైజయంతి అతన్ని వారించి, చట్ట ప్రకారం దోషులకు శిక్ష పడేలా చూస్తానని చెబుతుంది. అంతేకాకుండా, అర్జున్‌ను ఐపీఎస్ పూర్తి చేయమని చెప్పి మళ్లీ శిక్షణకు పంపిస్తుంది.ఒక సంవత్సరం తర్వాత అర్జున్ శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి వస్తాడు. అదే రోజు అతని తండ్రి కేసు యొక్క తీర్పు వెలువడుతుంది. అర్జున్ తండ్రిది హత్య కాదని, అది ప్రమాదవశాత్తు జరిగిందని కోర్టు తీర్పు ఇస్తుంది. హంతకులు కోర్టు నుండి బయటకు వస్తూనే వైజయంతిని అవమానకరంగా మాట్లాడుతారు. అన్యాయం ముందు చట్టం , న్యాయం ఓడిపోవడం అర్జున్ కళ్లారా చూస్తాడు. తన కళ్ల ముందే తల్లిని అవమానిస్తుంటే అతను తట్టుకోలేకపోతాడు. అతని కోపం కట్టలు తెంచుకుంటుంది. కోర్టు ఎదురుగానే ఒక హంతకుడిని కొట్టి చంపేస్తాడు. అంతేకాదు, తన తండ్రి హత్యకు కారణమైన ముఠాలోని అందర్నీ నరికి చంపుతాడు.ఐపీఎస్ కావాల్సిన కొడుకు తన కళ్ల ముందే హంతకుడిగా మారడం చూసిన వైజయంతి దిగ్భ్రాంతికి గురవుతుంది. గూండాగా మారిన కొడుకుతోనే యుద్ధానికి సిద్ధమవుతుంది. మరి విధి వేరు చేసిన ఈ తల్లి కొడుకులు మళ్లీ ఎలా కలిశారు? ఐపీఎస్ అవ్వాల్సిన అర్జున్ గూండాగా మారి ఏమి సాధించాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.
Read Also: Actor: నాక్కూడా కొన్ని ఫాంటసీలున్నాయి: షారుఖ్ ఖాన్