हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Anushka Shetty: సినిమాలు వదిలేద్దామనుకున్నా..

Anusha
Anushka Shetty: సినిమాలు వదిలేద్దామనుకున్నా..

తెలుగు ప్రేక్షకులకు ‘సూపర్’ మూవీతో పరిచయమై, ఆ వెంటనే తన గ్లామరస్ లుక్స్‌తో యువకులను కట్టిపడేసిన అనుష్క శెట్టి (Anushka Shetty),ఒక్క ‘అరుంధతి’ సినిమాతో ఆమె కెరీర్‌ను మలుపుతిప్పింది. ఆ సినిమా విడుదలైన రోజుతో పాటు, ఆ పాత్రను చూసిన ప్రేక్షకులు ఆమెను కేవలం హీరోయిన్‌గా గుర్తించసాగారు. పలు కమర్షియల్ సినిమాల్లో నటించినా, అనుష్క ఎప్పుడూ కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే ‘వేదం’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఆమెకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి.సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ ఆ మొదటి అడుగు ఎంతో కీలకం. అది భయంతో కూడిన ఉద్వేగం, ఆశలు, అనుమానాలు అన్నీ కలిసిన మేళవింపు. నాకు కూడా అలానే జరిగింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలిరోజుల్లో ఓసారి కె. రాఘవేంద్రరావు గారిని కలిసాను.

షూటింగ్ హడావుడి చూసి కంగారు పడిపోయేదాన్ని

అప్పటికి ఆయన ఒక దిగ్గజ దర్శకుడు. ఆయనతో మాట్లాడిన సందర్భం ఎంతో గౌరవంగా అనిపించినా, ఆయన దర్శకత్వంలో నేను నటిస్తానని మాత్రం ఎప్పటికీ ఊహించలేదు. కానీ కాలానికి చేతులెత్తాల్సిందే. కొంతకాలానికే ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాలో ఆయన డైరెక్షన్లో నటించే అవకాశం రావడం నాకు ఓ దేవుని ఆశీస్సులా అనిపించింది.చదువుకునే రోజుల్లోనేను సినిమాలు పెద్దగా చూసేదాన్ని కాదు. అందుకే సినిమా ఇండస్ట్రీ (Film industry) కి వచ్చిన కొత్తలో షూటింగ్ హడావుడి చూసి కంగారు పడిపోయేదాన్ని. నాకు ఈ సినిమాలు సెట్ కావనుకుని తిరిగి వెళ్లిపోయి యోగా టీచర్‌గా కెరీర్ కొనసాగిద్దామనుకున్నా. ఇన్నేళ్ల కెరీర్‌లో ‘అరుంధతి’ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఆ సినిమా వల్లే నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను.

Anushka Shetty: సినిమాలు  వదిలేద్దామనుకున్నా
Anushka Shetty: సినిమాలు వదిలేద్దామనుకున్నా

మొదట్లో పెద్ద తేడా అనిపించకపోయినా పరుగెడుతున్నప్పుడు

‘సైజ్‌ జీరో’ సినిమా కోసం బరువు పెరగడం, ఆ తర్వాత తగ్గడం. ఇలా చాలానే కష్టపడ్డా. ముందుగా ప్రోస్థెటిక్ మేకప్ ద్వారా నన్ను లావుగా చూపిద్దామని ప్రయత్నించగా, స్క్రీన్‌ మీద అనుకున్నట్లుగా కనిపించలేదు. దీంతో నేను బరువు పెరుగుతానని చెప్పాను. యోగా టీచర్‌గా బరువు తగ్గడం చాలా కష్టమని తెలిసినా అన్నం, కూరలు తింటూనే 20 కిలోల వరకు పెరిగాను. మొదట్లో పెద్ద తేడా (Difference) అనిపించకపోయినా పరుగెడుతున్నప్పుడు ఇబ్బంది పడేదాన్ని. ఆ తర్వాత బరువు తగ్గడానికి చాలా కష్టపడ్డాను. నేను ఫుడీని. అలాగని ఎక్కడపడితే అక్కడ తినను. ఇంటి భోజనం, అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం. పప్పుచారు ఒక్కటి ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు. నాకు హారర్ సినిమాలంటే చాలా భయం. ‘భాగమతి’ సినిమా చేసినా ఎప్పుడూ హారర్ సినిమాలు చూడను.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Vijay: తమిళ స్టార్ విజయ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: దిల్ రాజు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870