📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Anaganaga Movie: అనగనగా మూవీ రివ్యూ (ఈటీవీ విన్)

Author Icon By Anusha
Updated: May 17, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ హీరో సుమంత్, కాజల్ చౌదరి హీరోయిన్‌గా సన్నీ సంజయ్ తెరకెక్కించిన చిత్రం ‘అనగనగా’. ఈ మూవీని థియేటర్‌లోకి తీసుకు రాకుండా నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేసారు.థియేటర్లో విడుదల అయితే కమర్షియల్‌గా ఏ మాత్రం సక్సెస్ అయ్యేదో గానీ ఓటీటీలో మాత్రం ప్రశంసల్ని దక్కించుకుంటోంది. ఇంటిల్లి పాది హాయిగా చూసుకునేలా ఉందంటూ మౌత్ టాక్ వచ్చేసింది. దీంతో ఓటీటీలో ప్రస్తుతం ఈ మూవీని అందరూ చూసేందుకు ఇష్టపడుతున్నారు. మరి ఈ మూవీ కథ ఏంటో ఓ సారి చూద్దాం.

కథ

వ్యాస్ (సుమంత్) పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులు చెబుతుంటాడు. ప్రస్తుతం ఉండే విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగా పిల్లలకు బోధన చేయాలని పరితపిస్తుంటాడు. బట్టీ పట్టి చదివే చదువులు వ్యర్థం అని నమ్ముతుంటాడు. ర్యాంకులు మాత్రమే కావాలని అనుకునే ఇంటర్నేషనల్ స్కూల్ (Arrow World)లో పని చేస్తుంటాడు. ఆ స్కూల్‌కి చైర్మన్ రాజా రెడ్డి (అవసరాల శ్రీనివాస్). ఆ స్కూల్లోనే వ్యాస్ భార్య భాగ్యలక్ష్మీ (కాజల్ చౌదరి) ప్రిన్సిపాల్‌గా పని చేస్తుంటుంది. ఇక అదే స్కూల్‌లో వ్యాస్, భాగ్యలక్ష్మీ కొడుకు రామ్ (మాస్టర్ విహార్ష్) కూడా చదువుతుంటాడు. తండ్రి మాటల్ని ఫాలో అవుతూ, తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తుంటాడు రామ్. ఇక ఆ స్కూల్లో కేవలం మార్కులే లక్ష్యంగా, ర్యాంకులే పరమార్థంగా పిల్లల మీద ఒత్తిడి పెంచుతూనే ఉంటారు. కానీ వ్యాస్ మాత్రం తన ధోరణిలో వెళ్తూ పిల్లలకు నచ్చినట్టుగా ఉండాలని, ఎవ్వరి మాటలు గుడ్డిగా వినొద్దని చెబుతుంటాడు. ఇక ఇలా చేయడంతో కొంత మంది పిల్లలు స్కూల్లో ఫెయిల్ అవుతారు.దీంతో ప్రిన్సిపాల్ ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఫెయిల్ అయిన పిల్లలకు ఫెయిల్యూర్ అనే బ్యాడ్జ్‌లు ఇస్తుంది. దీంతో ఆ బ్యాడ్జ్‌ని చూస్తే ఇంట్లో తన తండ్రి కొడతాడని, స్కూల్లో అంతా నవ్వుతున్నారని భయపడి బిల్డింగ్ మీద నుంచి దూకేస్తాడు.పిల్లల కోసం ఏదైనా చేయాలని అనుకుంటాడు వ్యాస్.కొడుకు రామ్(Ram) సలహాతో ఓ స్కూల్‌ను ప్రారంభించాలని వ్యాస్ అనుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగింది? వ్యాస్ తన సొంత స్కూల్‌ని ప్రారంభిస్తాడా? ఈ నిర్ణయంతో భార్యాభర్తల మీద సమస్యలు వస్తాయా? అసలు విద్యా వ్యవస్థలో రావాలనుకున్న మార్పుని వ్యాస్ తీసుకు వస్తాడా? తండ్రి లేకపోతే ధైర్యంగా బతకలేని రామ్‌ను వ్యాస్ చివరకు ఎలా తీర్చి దిద్దుతాడు? అన్నదే కథ. 

Anaganaga Movie: అనగనగా మూవీ రివ్యూ (ఈటీవీ విన్)

కథనం

అనగనగా కథను చూస్తే మనకు ఆమిర్ ఖాన్ చేసిన తారే జమిన్ పర్, 3 ఇడియట్స్ గుర్తుకు రావొచ్చు. ఎందుకంటే విద్యా వ్యవస్థలోని లోపాల్ని చూపుతూ తీసిన చిత్రాల్లో అవి రెండూ ఆడియెన్స్ మైండ్‌లో రిజిస్టర్ అయి ఉంటాయి. ఇక ఈ కథ కూడా నేటి కార్పోరేట్ విద్యా వ్యవస్థ(Corporate education system)ను నేపథ్యంగానే తీసుకుని చేశారు. ప్రస్తుతం విద్య అనేది వ్యాపారంగానే మారిపోయింది. లక్షల్లో ఫీజులు వసూల్ చేస్తుంటారు. కానీ పిల్లల మనసుల్లోకి పాఠాల్ని ఎక్కించలేకపోతారు. అన్నీ బట్టీ పట్టి చదివించే చదువులే. కాన్సెప్ట్‌లను అర్థం చేసుకునే విధంగా కాకుండా మార్కుల కోసం మాత్రమే చదివిస్తుంటారు.సుమంత్ నటన అందరినీ ఆకట్టుకుంది. సుమంత్ పాత్రలోని సంఘర్షణ అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రిన్సిపాల్ పాత్రలో కాజల్ చౌదరి న్యాయం చేస్తుంది. శ్రీనివాస్ అవసరాల(Srinivas Avasarala) ఎప్పటిలానే మళ్లీ తన నటనతో మెప్పిస్తాడు. ఇక మాస్టర్ విహార్ష్ మాత్రం చాలా చోట్ల తన నటనతో ఆడియెన్స్‌ను కంటతడి పెట్టించేస్తాడు. హీరో ఫ్రెండ్ పాత్ర బాగుంటుంది. మిగిలిన పిల్లలు కూడా తమ తమ పాత్రల్లో మెప్పిస్తారు.

Read Also: Actress: నా స్కూల్‌ రోజులు గుర్తుకొచ్చాయి:సమంత

#Anaganaga #KajalChowdhary #ottrelease #Sumanth #SunnySanjay Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.