📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Ameesha Patel – తాను ఇంకా పెళ్లి చేసుకోలేక పోవడానికి కారణం చెప్పిన అమీషా పటేల్

Author Icon By Anusha
Updated: September 19, 2025 • 11:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్‌లో రెండు దశాబ్దాలకు పైగా తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి అమీషా పటేల్‌ (Ameesha Patel) తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగా మాట్లాడారు. ‘కహో నా ప్యార్ హై’, ‘గదర్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆమె ఇప్పటికీ పెళ్లి ఎందుకు చేసుకోలేదన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

తన కెరీర్ పట్ల ఉన్న అంకితభావం కారణంగా ఇప్పటి వరకు ఎన్నో వివాహ ప్రతిపాదనలను తిరస్కరించానని అమీషా పటేల్ పేర్కొన్నారు. చాలామంది తనను వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఒక షరతు విధించారని ఆమె తెలిపారు. పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని, ఇంటికే పరిమితం కావాలని వారు కోరుకున్నారని చెప్పింది.

ప్రేమను వదులుకుని కెరీర్‌ను ఎంచుకున్నట్లు ఆమె వివరించారు

అయితే తాను నటనను అంత సులువుగా వదిలేయలేనని, కెరీర్‌ కోసం కష్టపడి సాధించిన అవకాశాలను వదులుకోవడం తనకు ఇష్టం లేకపోవడం వల్ల అలాంటి ప్రతిపాదనలను మర్యాదపూర్వకంగా తిరస్కరించానని వివరించారు.ప్రేమించే వ్యక్తులు కెరీర్‌లో రాణించడానికి ప్రోత్సాహం ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు.సినిమాల్లోకి రాకముందే తనకు ఒకరితో సీరియస్ రిలేషన్‌షిప్ (Relationship) ఉండేదని అమీషా గుర్తుచేసుకున్నారు.

Ameesha Patel

ఇద్దరి కుటుంబ నేపథ్యాలు, అభిరుచులు కలిసినా, తాను నటిగా మారుతానని చెప్పినప్పుడు, పబ్లిక్ లైఫ్‌లో ఉండే వ్యక్తి వద్దని తన పార్ట్‌నర్ చెప్పడంతో ప్రేమను వదులుకుని కెరీర్‌ (Career) ను ఎంచుకున్నట్లు ఆమె వివరించారు.తాను పెళ్లికి వ్యతిరేకం కాదని, సరైన, అర్హత ఉన్న వ్యక్తి దొరికితే తప్పకుండా చేసుకుంటానని అమీషా అన్నారు.

తనకు ఎలాంటి అభ్యంతరం లేదని

తనకు ఇప్పటికీ మంచి కుటుంబాల నుంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయని, తనలో సగం వయసున్న వారు కూడా డేటింగ్‌కు ఆహ్వానిస్తున్నారని తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా మానసిక పరిపక్వత ఉన్న వ్యక్తి అయితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె పేర్కొన్నారు.

ఇక అమీషా పటేల్ కెరీర్ విషయానికొస్తే, గతేడాది ‘గదర్ 2’ చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సన్నీ డియోల్‌తో కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.686 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆమె ‘తౌబా తేరా జల్వా’ అనే చిత్రంలో కనిపించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/beauty-movie-review-telugu-2025/review/550143/

Ameesha Patel Bollywood actress Breaking News career focus gadar interview kaho na pyaar hai latest news marriage proposals Personal Life Telugu News youtube channel

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.