📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Akhil Akkineni : ఘనంగా ముగిసిన అఖిల్ అక్కినేని వివాహం

Author Icon By Anusha
Updated: June 7, 2025 • 2:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ యంగ్ హీరో, అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు జైనాబ్ రవ్జీని గతేడాది నవంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న అఖిల్ జూన్ 6నఆ ఆమెతో కలిసి ఏడడుగులు వేశారు. వీరిద్దరి వివాహనికి సన్నిహితులు, సినీతారలు హజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.వీరిద్దరి వివాహం అక్కినేని నాగార్జున నివాసంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీతారల హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరలవుతున్నాయి. జూన్ 8న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి రిసెప్షన్ వేడుకను నిర్వహించనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు గతేడాది నవంబర్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అక్కినేని అఖిల్ సతీమణి జైనాబ్ రవ్జీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

పాఠశాల విద్య

ఈ నేపథ్యంలోనే,అఖిల్, జైనాబ్ విద్యార్హతల గురించి నెట్టింట తెగ ప్రచారం నడుస్తుంది. జైనాబ్ హైదరాబాద్‌లోని గీతాంజలి స్కూల్,నాసర్ స్కూల్‌లో చదువుకుంది. ఆమె హామ్స్‌టెక్ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ విద్యను పూర్తి చేసింది. అఖిల్ చైతన్య విద్యాలయంలో చదువుకున్నాడు. రెండేళ్లు ఆస్ట్రేలియాలో ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌(Oakridge International School)లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. అతను సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం నుండి బిబిఎ డిగ్రీని పొందాడు. ఆ తర్వాత న్యూయార్క్‌లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ & ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొందాడు.

Akhil Akkineni : ఘనంగా ముగిసిన అఖిల్ అక్కినేని వివాహం

నటించిన చిత్రాలన్నీ

ఇకపోతే, జైనాబ్ గురించి చెప్పాలంటే,ప్రతిభావంతులైన కళాకారిణి, పెర్ఫ్యూమర్. బ్లాగర్ ఆమె 7 సంవత్సరాల వయస్సులో పెయింటింగ్ ప్రారంభించింది. ఆమె “వన్స్ అపాన్ ది స్కిన్” అనే బ్లాగును కూడా నడుపుతోంది. ప్రస్తుతం అఖిల్ సినీరంగం(Cinema industry)లో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు అతడు నటించిన చిత్రాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. ప్రస్తుతం, లెనిన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.

Read Also: Harihara Veeramallu: భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’: జ్యోతికృష్ణ

#AkhilGetsMarried #AkhilWedsZainab #AkhilZainabWedding #ZainabAndAkhil Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.