📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Adah Sharma: నెపోటిజంపై అదా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: May 25, 2025 • 2:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్‌లో నెపోటిజం (బంధుప్రీతి) అనే పదం కొత్తది కాదు.స్టార్ కిడ్స్‌కు అవకాశాలు ఎక్కువగా లభించడంపై చాలామంది నటులు, దర్శకులు ఇప్పటికే పలుమార్లు స్పందించారు. ఈ నేపథ్యంలో నటి అదా శర్మ కూడా తనదైన శైలిలో ఈ అంశంపై స్పందించారు.తాను సినిమా కుటుంబం నుండి వచ్చి ఉంటే తనను హారర్ సినిమాతో పరిచయం చేసేవారు కాదని ఆమె పేర్కొన్నారు.అదా శర్మ తన కెరీర్‌ను 2008లో విడుదలైన హారర్ సినిమా ‘1920’ తో ప్రారంభించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ, ఒక నటిగా మంచి గుర్తింపు ల‌భించ‌లేదు. దీనిపై అదా శర్మ(Adah Sharma) మాట్లాడుతూ, “నేను సినిమా కుటుంబం నుండి వచ్చి ఉంటే, నన్ను పరిచయం చేయడానికి ఒక పర్ఫెక్ట్ రొమాంటిక్ సినిమా కోసం వేచి ఉండేవారు. నా కుటుంబం నన్ను హారర్ సినిమా చేయనిచ్చేది కాదు. ఎవరు తమ కెరీర్‌ను దెయ్యం పట్టినట్లు, నల్లటి పళ్లతో తెరపై కనిపిస్తూ ప్రారంభిస్తారు? ప్రముఖుల కుటుంబం నుండి వచ్చి ఉంటే, ఒక సాధారణ రొమాంటిక్ సినిమాతో నా కెరీర్ ప్రారంభమయ్యే అవకాశం ఉండేది. నేను ‘1920’ తో ప్రారంభించాను, అందుకు నేను అదృష్టవంతురాలిని. నేను ఏదైనా కొత్తగా ప్రయత్నించినప్పుడల్లా ప్రేక్షకులు నన్ను అంగీకరిస్తారు. బహుశా అందుకే సినీ నిర్మాతలు కూడా నన్ను విభిన్న పాత్రలలో నటించడానికి ధైర్యం చేస్తున్నారు” అని అన్నారు.

Adah Sharma: నెపోటిజంపై అదా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రశంసలు

అదా శర్మ ‘కమాండో’ ఫ్రాంచైజీలో యాక్షన్ పాత్రలతో ఆకట్టుకోవడమే కాకుండా, ‘ది కేరళ స్టోరీ’ చిత్రంలో కూడా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ విషయంపై అదా శర్మ మాట్లాడుతూ, ‘ది కేరళ స్టోరీ’ చూసినప్పుడు, ‘ఓహ్, ఆమె యాక్షన్ చేయగలదు, ఆమె ఎందుకు టెర్రరిస్ట్‌ల‌ను కొట్టడం లేదు?’ అని ప్రజలు అనలేదు. ‘సన్‌ఫ్లవర్ సీజన్ 2’ లో బార్ డ్యాన్సర్ రోసీగా, ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ లో ఐపీఎస్ అధికారిగా కూడా ప్రజలు నన్ను మెచ్చుకున్నారు. నా కెరీర్ ఈ విధంగా విభిన్నంగా సాగినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని” అని తెలిపారు. అదా శర్మ తన కెరీర్‌(Career)లో విభిన్నమైన, సవాలుతో కూడిన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం అదా శర్మ తన రాబోయే ప్రాజెక్ట్‌లో ఒక దేవత పాత్రలో కనిపించనున్నారు.

Read Also: Spirit Movie:ప్రభాస్‌ తో నటించనున్న త్రిప్తి డిమ్రి

#AdahOnNepotism #AdahSharma #BollywoodNepotism #BollywoodNews #IndianCinema #NepotismDebate Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.