అందంగా ఉండటం ద్వారా అవకాశాలు వస్తాయనుకుంటారు చాలామంది. కానీ సినీ రంగంలో ఈ నమ్మకం కాస్త తేడాగా ఫలిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బ్యూటీతో పాటు టాలెంట్, టైమింగ్, లక్ అన్నీ కలిసిరావాలి. అందం ఒక్కటే ఉంటే సరిపోదు. అందాన్ని ఓ ఆయుధంగా మార్చుకోవాలంటే అదృష్టం కూడా దారిలో ఉండాలి. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పటికీ, సోషల్ మీడియా గ్లామర్ షో (Glamor show) కి అడ్డుకట్టవ్వడం లేదు. అందం ఉన్నవాళ్లందరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో రెగ్యులర్‌గా ఫోటోషూట్లు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు.
ట్రెండీ రీల్స్‌తో గ్లామర్‌ను ప్రదర్శిస్తూ తమకో గుర్తింపు తెచ్చుకుంటున్నారు
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి వేదికలు ఇప్పుడు సెలెబ్రిటీలకు మాత్రమే కాదు రేపటి తరం హీరోయిన్లకు కూడా ఒక ప్లాట్‌ఫామ్‌గా మారిపోయాయి. సినిమాల్లో అవకాశాలు రాకపోయినా.. ఫ్యాషన్ ఫొటోలు, ట్రెండీ రీల్స్‌తో గ్లామర్‌ను ప్రదర్శిస్తూ తమకో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ సోషల్ మీడియా (Social media) పాపులారిటీ ద్వారానే వారు వెబ్‌సిరీస్‌లు, యాడ్స్, చిన్న చిత్రాల్లో అవకాశాలు కూడా అందుకుంటున్నారు.
షాలిని పాండే
నభా నటేష్
సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న మరో బ్యూటీ నభా నటేష్ (Nabha Natesh). ప్రస్తుతం నిఖిల్‌తో స్వయంభులో నటిస్తున్నారు నభా.
కృతి శెట్టి
హ్యాట్రిక్ బ్యూటీ కృతి శెట్టి (Kriti Shetty) సైతం సోషల్ మీడియాకే అంకితమైపోతున్నారు. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంతా తమిళ ఇండస్ట్రీపైనే ఉంది. అక్కడ కార్తి, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో సినిమాలు చేస్తున్నారు. మొత్తానికి ఆఫర్స్ ఉన్నోళ్లు లేనోళ్లు అందరి దారి సోషల్ మీడియానే.
మీనాక్షి చౌదరి
ఆ మధ్య వరసగా సినిమాలు చేసిన మీనాక్షి చౌదరి కొన్ని నెలలుగా కనిపించట్లేదు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఈమె సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతం నాగ చైతన్య, కార్తిక్ దండు సినిమాతో పాటు, అనగనగా ఒకరాజులో నటిస్తున్నారు మీనాక్షి (Meenakshi Chowdhury). ఈ గ్యాప్‌లో సోషల్ మీడియాలో అదిరిపోయే హాట్ షో చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈమె ఫోటోషూట్ వైరల్ అవుతుంది.
కీర్తి సురేష్
కీర్తి సురేష్ సైతం ఈ మధ్య సోషల్ మీడియానే వేడెక్కించడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ కోసం మరోసారి హాట్ షో చేసారు కీర్తి. ఈమె ఫోటోషూట్ వైరల్ అవుతుంది. మరోవైపు వరస సినిమాలతో బిజీగా ఉన్నారు కీర్తి (Keerthy Suresh). ఉప్పు కప్పురంబు నేరుగా ఓటిటిలోకి వస్తుంటే, ఆగస్ట్ 27న రివాల్వర్ రీటా, నెట్‌ఫ్లిక్స్‌లో అక్క సిరీస్‌లు క్యూలో ఉన్నాయి.
రాశీ ఖన్నా
అవకాశాలు ఉన్నవాళ్లే కాదు, వాటి కోసం చూస్తున్న వాళ్లకు ఇన్‌స్టాగ్రామ్ బెస్ట్ ఆప్షన్ అయిపోయింది. రాశీ ఖన్నా (Rashi Khanna) ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూనే ఉంటారు.కాబట్టి, అందంగా ఉండటం ఒక ప్లస్ పాయింట్ మాత్రమే. దాన్ని విజయంగా మలచుకోవాలంటే, ఆత్మవిశ్వాసం, కష్టపడి పనిచేసే తీరు, పరిస్థితులకు తగినట్లు మారే అజస్ట్మెంట్, ముఖ్యంగా టైమింగ్ అనే అదృష్టం అవసరం. అప్పుడే అందం వెనుకున్న శ్రమ వెలుగులోకి వస్తుంది. లేదంటే.. ఆ అందం సోషల్మీడియాకే పరిమితమైపోతుంది!
Read hindi: hindi.vaartha.com
Read Also: Collagen: కొల్లాజెన్ తక్కువైతే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే?