हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Samantha: త‌న బాడీపై కామెంట్స్ చేసిన వారికి సమంత ఘాటు కౌంటర్!

Anusha
Samantha: త‌న బాడీపై కామెంట్స్ చేసిన వారికి సమంత ఘాటు కౌంటర్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తుంటారు. సినిమాల్లో తన పాత్రలతోనూ, సోషల్ మీడియా లో తన వ్యక్తిత్వాన్ని బలంగా వ్యక్తీకరించడానికీ ఆమె ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల సినిమాల కన్నా, ఆరోగ్యానికి సంబంధించిన పోస్ట్‌లు, వ్యక్తిగత జీవితం పై స్పందనలు ఎక్కువగా ఆమె సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.ఇటీవల సమంత తన శరీరాకృతిపై ఓ ఫోటోను పోస్ట్ చేయగా, కొందరు నెటిజన్లు అవాంఛనీయమైన వ్యాఖ్యలు, శరీరం (Body) పై కామెంట్లు చేశారు. దీనికి ఆమె తీవ్రంగా స్పందిస్తూ, ఓ స్పష్టమైన కౌంటర్ ఇచ్చింది. త‌న‌ని విమ‌ర్శించే వారికి ఫిట్ నెస్ స‌వాల్ విసురుతూ తాను జిమ్ లో చేస్తున్న పుల్ అప్స్ వీడియోని పంచుకుంది. నా గురించి త‌ప్పుడు కామెంట్స్ చేసే వారు మూడు పుల్-అప్స్ తీసి చూపించాలని, అలా చేయలేని పక్షంలో తన గురించి మాట్లాడటం మానేయాలంటూ కాస్త ఘాటుగానే బ‌దులిచ్చింది స‌మంత‌.

తన లుక్స్‌పై వస్తున్న విమర్శలకు సమాధానంగా

ఇటీవ‌ల స‌మంత అవార్డ్‌ల వేడుక‌కి హాజ‌రు కాగా, ఆ కార్య‌క్ర‌మానికి శ్రీలీల కూడా హాజ‌రైంది. అయితే ఆ స‌మ‌యంలో స‌మంత‌, శ్రీలీల ఇద్ద‌రు క‌లిసి దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి. అయితే ఇందులో స‌మంత (Samantha) లుక్ కొంద‌రిలో అనేక అనుమానాలు క‌లిగించాయి. అనారోగ్యం వ‌ల‌న సమంత బాగా సన్నబడ్డారని కొంద‌రు కామెంట్లు చేశారు. ఈ క్ర‌మంలో తన లుక్స్‌పై వస్తున్న విమర్శలకు సమాధానంగా సమంత త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో సామ్ జిమ్‌లో పుల్ అప్స్ చేయ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.అయితే త‌న పోస్ట్‌కి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్ష‌న్ జోడించింది స‌మంత‌.

Samantha

ప్ర‌త్యేక‌ చికిత్స తీసుకుంటూనే, ఫిట్‌నెస్‌పై ఎక్కువ‌గా

మ‌నం ఒక డీల్ చేసుకుందాం. ‘సన్నబడ్డావు’, ‘ఆరోగ్యం బాలేదా?’ లాంటి చెత్త కామెంట్స్ ఎవ‌రైతే చేస్తున్నారో , మీరు కనీసం మూడు పుల్-అప్స్ చేయగలగాలి. ఒకవేళ మీరు ఆ పని చేయలేకపోతే, దయచేసి నా గురించి మాట్లాడ‌డం మానేస్తే మంచిది అంటూ స‌మంత పేర్కొంది. ఇక కొంతకాలంగా సమంత మయోసైటిస్ (Myositis) అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతున్న విషయం మ‌నంద‌రికి తెలిసిందే. 2022లో తాను ఈ వ్యాధి బారిన పడినట్లు చెప్పుకొచ్చిన ఈ భామ అప్పటి నుంచి ప్ర‌త్యేక‌ చికిత్స తీసుకుంటూనే, ఫిట్‌నెస్‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతుంది. ఇటీవల స‌మంత‌ నిర్మించిన ‘శుభం’ సినిమా విడుదలై మంచి విజ‌యం సాధించింది.

Read Also: Naga Chaitanya: వృత్తి పరమైన బిజీ జీవితం లోను మా బంధం బలంగానే వుంది: చైతూ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870