📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Imanvi: నన్ను కళాకారిణిగా చూడండి..పాకిస్తాన్ తో నాకు సంబంధం లేదు: ఇమన్వి

Author Icon By Anusha
Updated: April 24, 2025 • 2:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాక్ నటీనటులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారి సినిమాలను బ్యాన్ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రభాస్ ఫౌజి హీరోయిన్ ఇమాన్వీకి కూడా పాకిస్తాన్ తో సంబంధాలున్నాయని నెట్టింట ప్రచారం జరిగింది.ఇమాన్వీ పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి అని, ఆమెను మన ఇండియన్ సినిమాలో ఎందుకు తీసుకున్నారని, ఇమాన్వీని బహిష్కరించండి సినిమాలోంచి తీసేయండి అంటూ కొందరు డిమాండ్ చేశారు. ఈ మేరకు నెట్టింట్లో ట్రెండ్ కూడా చేశారు. అయితే ఈ విషయాల మీద తాజాగా ఇమాన్వీ స్పందించింది.

కనెక్షన్ లేదు

పహల్గాం ఘటనలో చనిపోయిన, గాయపడిన, బాధపడిన వారందరికీ, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అమాయక ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో నా గుండె తరుక్కుపోయింది. ఇలాంటి ఘటనల్ని వెంటనే ఖండించాలి నేను ఓ ఆర్టిస్ట్‌గా ఎప్పుడూ ప్రేమను పంచాలనే ప్రయత్నిస్తాను మనమంతా ఒక్కటిగా ప్రశాంతంగా బతికే రోజు వస్తుందనే ఆశతో ఉంటున్నాను.నా మీద ద్వేషం పెంచేందుకు కొంత మంది ఆన్ లైన్‌లో, మీడియాలో నా గురించి, నా ఫ్యామిలీ గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఒకప్పుడు గతంలో గానీ, ఇప్పుడు గానీ పాకిస్థాన్‌తో, మిలటరీతో నా కుటుంబ సభ్యులకు ఎలాంటి కనెక్షన్ లేదు కానీ నా మీద ద్వేషం పెంచేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొన్ని మీడియా చానెళ్లు, న్యూస్ పోర్టల్స్ కూడా అసలు విషయాన్ని తెలుసుకోకుండా సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయకుండా తప్పుడు ప్రచారం చేస్తుండటమే నాకు బాధను కలిగించింది.

ఇండియన్ కల్చర్

నేను ఇండో అమెరికన్ అని గర్వంగా చెప్పుకుంటాను నేను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడగలను లాస్ ఏంజిల్స్‌లో పుట్టాన. నా తల్లిదండ్రులు చిన్నతనంలోనే ఇక్కడకు వచ్చి ఇక్కడి అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. నేను అమెరికాలోనే చదువుకున్నాను. ఆర్ట్స్, యాక్టర్, కొరియోగ్రఫర్, డ్యాన్సర్ వంటి కోర్సుల్ని చేశాను. సోషల్ మీడియాలో నా రీల్స్ చూసి నాకు ఆఫర్లు ఇచ్చారు.అలా నేను ఇండియన్ ఇండస్ట్రీలోకి వచ్చాను.నా బ్లడ్డులో కూడా ఇండియన్ కల్చర్ నిండి ఉంటుంది.ప్రస్తుతం ఉన్న ఈ మీడియంను విడగొట్టడానికి కాకుండా ఐకమత్యానికి వాడుకుందాం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఒకరికొకరం తోడుగా నిలబడాలి చరిత్రలో చూసుకుంటే కళ ద్వారానే ఎంతో మందికి అవగాహన, చైతన్య వంటివి కలిగించారు, కళ ద్వారా నేను కూడా ఈ ప్రపంచానికి ఇండియన్ గొప్పదనాన్ని చాటి చెబుతాను’ అని ఇమాన్వీ చెప్పుకొచ్చింది. మరి దీంతో ఇమాన్వీ మీద పెంచుకున్న ద్వేషాన్ని పక్కన పెడతారో లేదో చూడాలి.

Read Also: OTT : ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘గార్డియన్’ మూవీ

#BoycottTrend #Eimaan #IndianCinema #PahalgamAttack #Prabhas #TrendingControversy Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.