हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Cinema News: సినిమా సక్సెస్ అవ్వాలని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హీరో ఎవరంటే!

Anusha
Cinema News: సినిమా సక్సెస్ అవ్వాలని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హీరో ఎవరంటే!

వేసవి సెలవులు కావడంతో చాలా మంది విహార యాత్రలకు, అలాగే పుణ్య క్షేత్రాల దర్శనానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక సినీ ప్రముఖులు కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్నారు. ఈ క్రమంలో త్వరలో రిలీజ్ కానున్న తమ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సామాన్య భక్తుల్లో కలిసిపోయి కాలినడకన మెట్లు ఎక్కుతూ తిరుమలకు చేరుకున్న ఈ స్టార్స్ ఆదివారం (ఏప్రిల్ 27) ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే తిరుమలకు వెళ్లేటప్పుడు తమను ఎవరూ గుర్తు పట్టకుండా ముఖాలకు మాస్కులు, కర్చీఫ్ లు ధరించారు. దీంతో చాలా మంది భక్తులు వీరిని గుర్తు పట్టలేకపోయారు. అయితే కొంత మంది టాలీవుడ్ సెలబ్రిటీలను గుర్తు పట్టి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

మేడే కానుక

న్యాచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి. వీరిద్దరూ జంటగా నటించిన చిత్రం హిట్ -3.బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వ‌స్తున్న 3వ చిత్ర‌మిది. ఈ చిత్రంలో నాని క‌థానాయ‌కుడిగా న‌టించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండ‌గా, ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మేడే కానుకగా మే 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం సుప్రభాత సేవ సమయంలో స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు హీరో, హీరోయిన్లకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంగీతం

కాలి నడకన శ్రీవారి మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకున్నారు నాని, శ్రీనిధి శెట్టి. ఇక హిట్ -3 సినిమా విషయానికి వస్తే, శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నాని అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాథ్, అదిల్ పాలా, సూర్య శ్రీనివాస్ తదితరలు నటించారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన టీజర్స్, ట్రైలర్ చూస్తే సినిమాలో ఫుల్ వయోలెన్స్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది.ఇక రీసెంట్ గా ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’ సినిమా ఏప్రిల్ 21న సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. ముందు నుంచీ ఇదొక మోస్ట్ వైలెంట్ ఫిలిం అని నాని చెబుతూనే ఉన్నారు. ప్రమోషనల్ కంటెంట్ చూసి ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దానికి తగ్గట్టుగానే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) ‘ఏ’ సర్టిఫికెట్‌ జారీ చేసింది. అంటే ఈ చిత్రాన్ని పెద్దలు మాత్రమే థియేటర్లలో వీక్షించాలన్న మాట.

Read Also: upcoming movie :’లక్కీ భాస్కర్’ విజయం తర్వాత వెంకీ అట్లూరితో సూర్య

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870