Actor: రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు.. ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

Read Time:  1 min
Actor: రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు.. ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ
FONT SIZE
GET APP

మెగా పవర్ స్టార్ (Actor) రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఇంట ఆనందం రెండింతలైంది. ఈ ప్రముఖ సెలబ్రిటీ జంటకు కవల పిల్లలు జన్మించడంతో కుటుంబం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు బాబు, పాప జన్మించారని.. తమ ఇంట్లో ఆనందం డబుల్ అయ్యిందంటూ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ సంతోషకరమైన వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వెల్లువ మొదలైంది.

Read Also: Singeetam Srinivasa Rao: 94 ఏళ్ల వయసులో సినిమా డైరెక్ట్ చేయనున్న సింగీతం శ్రీనివాసరావు

జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వక అభినందనలు

తాజాగా అగ్ర క‌థానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా హృదయపూర్వక అభినందనలు తెలియజేశాడు.తారక్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. ‘రామ్ చరణ్, ఉపాసనలకు కవలలు జన్మించినందుకు అభినందనలు. మీ కుటుంబం ఎల్లప్పుడూ ప్రేమ, ఆరోగ్యం, ఆనందంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను’. అంటూ తార‌క్ రాసుకోచ్చాడు.

లావణ్య చేసిన పోస్ట్

“హాయ్ చిట్టి కవలలు.. ఈ ప్రపంచంలోకి మీకు స్వాగతం.. ఇప్పటికే మిమ్మల్నీ అందరూ ప్రేమిస్తున్నారు. క్లింకారకు ఇప్పుడు అఫీషియల్ గా అక్కగా ప్రమోషన్ వచ్చింది. మీతోపాటు పెరిగేందుకు.. అల్లరి చేసేందుకు మీ అన్నయ్య వాయువ్ ఎదురుచూస్తున్నాడు” అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం లావణ్య చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. 

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.