हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Ace Movie: ఓటీటీలోకి ‘ఏస్‌’ సినిమా

Anusha
Ace Movie: ఓటీటీలోకి ‘ఏస్‌’ సినిమా

తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఏస్‌’ (Ace) మే 23న విడుదలైన విషయం తెలిసిందే. అరుముగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో డిజాస్టర్గా నిలిచింది. విడుదలైన మొదటి వారంలోనే ప్రేక్షకుల నుంచి ప్రతికూల స్పందన వచ్చిందని సినీ వర్గాలు వెల్లడించాయి.అయితే, ఈ చిత్రం ఇప్పుడు థియేటర్ల నుంచి ఓటీటీలోకి తక్కువ సమయంలోనే అడుగుపెట్టింది. ఏ విధమైన ప్రకటన లేకుండా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో(Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతోంది. సాధారణంగా సినిమాలు ఓటీటీలోకి వచ్చేటప్పుడు స్ట్రీమింగ్ డేట్‌ను ముందుగానే ప్రకటిస్తుంటారు. కానీ ‘ఏస్‌’ విషయంలో అలాంటిదేమీ లేకపోవడం గమనార్హం.

ఆశ్రయం

ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడీగా రుక్మిణీ వసంత్ నటించగా, కామెడీ నటుడు యోగిబాబు, పృథ్వీరాజ్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కథేంటంటే,జైలు నుంచి విడుదలైన బోల్ట్ కాశీ (విజయ్ సేతుపతి) కొత్త జీవితం మొదలుపెట్టేందుకు మలేసియాకు వస్తాడు. అక్కడ జ్ఞానానందం (యోగి బాబు) అతనికి ఆశ్రయం కల్పిస్తాడు. కల్పన (దివ్యా పిళ్లై) నడిపే హోటల్‌లో చెఫ్‌గా కాశీ పనిలో చేరతాడు. ఈ క్రమంలో రుక్మిణి (రుక్మిణి వసంత్)తో ప్రేమలో పడతాడు. తన పెంపుడు తండ్రి రాజా దొరై (బబ్లూ) నుంచి ఇంటిని విడిపించుకోవడానికి ఆమె డబ్బు కూడబెడుతున్న విషయం తెలుసుకుంటాడు.

Ace Movie: ఓటీటీలోకి ‘ఏస్‌’ సినిమా
Ace Movie

ప్రమాదకరమైన

మరోవైపు తన యజమాని కల్పన కూడా హోటల్‌ లోన్‌ కట్టలేక ఇబ్బంది పడుతుంది. దీంతో వీరిద్దరి సమస్యలను తీర్చడానికి జ్ఞానానందం (Jnanandam) తో కలిసి బోల్డ్‌ కాశీ మలేసియాలో అక్రమ వ్యాపారాలు నడిపించే ధర్మ(అవినాశ్‌) దగ్గర అప్పు తీసుకుంటారు. ఈ క్రమంలో వడ్డీ కట్టడం ఆలస్యమైతే ప్రాణాలు తీసే ధర్మ ఉచ్చులో వారు చిక్కుకుంటారు. ఈ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బోల్ట్ కాశీ ఎలా బయటపడ్డాడు? బ్యాంకు దోపిడీతో సంబంధం ఏమిటి? ఈ నేరాలన్నిటి నుంచి తప్పించుకుని, తాను ప్రేమించిన రుక్మిణితో సంతోషంగా జీవిస్తాడా? అసలు బోల్ట్ కాశీ గతం ఏమిటి? చివరికి అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Read Also: Ahmedabad plane crash : ప్లేన్ క్రాష్ : ఈవెంట్ రద్దు చేసుకున్న సల్మాన్ ఖాన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870