हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Ace Movie: ఏస్ మూవీ ట్రైలర్ రిలీజ్

Anusha
Ace Movie: ఏస్ మూవీ ట్రైలర్ రిలీజ్

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుపతి కెరీర్ ప్రారంభంలో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించి, ఇప్పుడు హీరోగా రాణిస్తున్నారు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ, తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సేతుపతి ‘ఏస్’ (Ace) అనే చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేసారు. విజయ్ సేతుపతి(Vijay Sethupathi), రుక్మిణీ వసంత్‌ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఏస్’. అరుముగకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇదొక కమర్షియల్‌ యాక్షన్ థ్రిల్లర్.ఇందులో బోల్డ్‌ కన్నన్‌ అనే పాత్రలో సేతుపతి కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం మే 23, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్.ఉత్కంఠకు గురిచేసే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందిందని, విజయ్‌సేతుపతి కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచే సినిమా ఇదని మేకర్స్‌ చెబుతున్నారు. 

కీలక పాత్ర

ఈ చిత్రంతో రుక్మిణి వసంత్(Rukmini Vasant) తమిళంలో అరంగేట్రం చేస్తోంది. అలాగే, యోగి బాబు కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, బి.ఎస్. అవినాష్, ముత్తు కుమార్, రాజ్ కుమార్, డెనెస్ కుమార్, ఆల్విన్ మార్టిన్, ప్రిస్సిల్లా నాయర్, జాస్పర్ సుపయ్య, కార్తీక్ జై, నాగులన్జ,హ్రినారిస్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు.

మహారాజా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సేతుపతి నుంచి రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని తమిళంతో పాటుగా ఇతర భాషల్లోనూ విడుదల చేసే అవకాశాలున్నాయి.’ఏస్‌’ కాకుండా విజయ్ సేతుపతి లైనప్ లో ‘ట్రైన్‌’ అనే సినిమా ఉంది. మిస్కిన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో సేతుపతి ఓ మూవీని అనౌన్స్ చేసారు. దీనికి ‘బెగ్గర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో టబు కీలక పాత్ర పోషించనుంది. రాధికా ఆప్టేని కూడా ఓ రోల్ కోసం తీసుకున్నారని టాక్.

Read Also: Actress: అభిమానుల వ‌ల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా: సమంత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870