📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Aamir Khan: మ‌హాభార‌తం నా కెరీర్‌లో చివ‌రి సినిమా కావొచ్చున్న అమీర్ ఖాన్

Author Icon By Anusha
Updated: June 1, 2025 • 1:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కెరీర్‌లో వైవిధ్య‌మైన చిత్రాలు చేసిన ఆయ‌న ఎన్నో వెరైటీ పాత్ర‌లు పోషించి అల‌రించారు. ఇప్ప‌టికీ అదే శైలిలో న‌డుస్తున్నారు. అందుకే అభిమానులు ఆయ‌న‌ని ముద్దుగా బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అంటుంటారు. అమీర్ ఖాన్ త్వ‌ర‌లో ‘సీతారే జమీన్ పర్’ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానున్న నేప‌థ్యంలో ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. ఈ క్ర‌మంలో రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమిర్, తాను చాలా ఏళ్లుగా కలలు కంటున్న ‘మహాభారతం’ ప్రాజెక్ట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.మ‌హాభార‌తం చిత్రం అనేది త‌న చిన్న‌ప్ప‌టి క‌ల అని అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతీ భావోద్వేగం, ప్రతి మానవ సంబంధం మహాభారతం(Mahabharatam)లో కనిపిస్తుంది. నేను దాన్ని సినిమా రూపంలో మ‌ల‌చాల‌ని కోరుకుంటున్నాను అని చెప్పారు. ఈ సినిమా నా కెరీర్‌లో చివ‌రి సినిమా కూడా కావొచ్చు అని ఆయ‌న తెలియ‌జేశారు. ఇలాంటి గొప్ప క‌థ త‌ర్వాత నాకు ఇంకా ఏం చేయాలో కూడా అర్ధం కాని ప‌రిస్థితి. నాకు ప‌ని చేస్తూ చనిపోవాల‌ని ఉంది కాని, బహుశా ఇదే చివ‌రి సినిమా అవుతుంద‌ని ఆమీర్ అన్నారు. ఈ కామెంట్స్‌తో ఫ్యాన్స్ షాక్‌లో ఉండిపోయారు. మీరు ఎన్నో గొప్ప సినిమాలు చేయాలి, ఇప్పుడే రిటైర్మెంట్ ఆలోచ‌న చేయ‌కండి అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

Aamir Khan

ఆయనప్రస్తుతం మూడు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ‘హ్యాపీ పటేల్’, ‘చార్ దిన్ కీ చాందనీ’, ‘మహాభారతం’తో పాటు జోయా అక్తర్(Zoya Akhtar) సినిమాలో కూడా న‌టిస్తున్నారు. అయితే మ‌హాభార‌తం మాత్రం అమిర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు. అయితే రాజమౌళి కూడా మ‌హాభార‌తం త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పినా ఆయన ఆ వైపు అడుగులు వేయలేదు. అయితే జక్కన్న కన్నా ముందు అమీర్ ఖాన్ రంగంలో దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నట్లు చెప్పారు. అయితే స్క్రీప్ట్ రాయడానికి టైం పడుతుందని పైగా అన్ని క్యారెక్టర్లను ఒకే సినిమాలో చూపించలేం కాబట్టి సీరిస్ గా దీన్ని తెర‌పైకి తీసుకొస్తానంటూ పేర్కొన్నారు.

Read Also: Subham Movie: ఓటీటీలోకి ‘శుభం’ మూవీ ఎప్పుడంటే?

#AamirKhan #AamirLastFilm #MahabharatDream #MahabharatMovie Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.