బాలీవుడ్ కథానాయకుడు ఆమిర్ ఖాన్ తన మనసులోని మాటలను పంచుకున్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో పనిచేయాలన్నది తన చిరకాల కోరిక అని ఆయన వెల్లడించారు. ఆమిర్ ఖాన్ హీరోగా ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో తెరకెక్కిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాలను తెలిపారు.
ప్రేక్షకుల ముందుకు
ఆమిర్ ఖాన్(Aamir Khan) మణిరత్నం గురించి మాట్లాడుతూ, “నేను మణిరత్నంగారికి పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి పనిచేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. చాలాసార్లు ఆయన్ను కలిశాను, ఆయన ఇంటికి కూడా వెళ్లాను. మేమిద్దరం అనేక విషయాలపై చర్చించుకున్నాం. నిజానికి, మా ఇద్దరి కలయికలో ‘లజ్జో’ అనే సినిమా కూడా ఖరారైంది. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే, ఆ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అయినా, ఆయనపై నాకున్న అభిమానం ఏమాత్రం తగ్గలేదు. ఆయన పనితీరు నాకు ఎంతో ఇష్టం. భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఆయనతో తప్పకుండా సినిమా చేస్తాననే నమ్మకం ఉంది” అని ఆమిర్ ఖాన్ వివరించారు.
Read Also: Pooja Hegde: జన నాయగన్ ,విజయ్ చివరిచిత్రం అవ్వడం బాధగా ఉందన్న పూజా హెగ్డే