📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

8 Vasantalu: ‘8 వసంతాలు’ మూవీ ఎలాఉందంటే?

Author Icon By Anusha
Updated: June 20, 2025 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ రోజుల్లో తెరపై మనం ఎక్కువగా చూస్తున్నవి – భీకర యాక్షన్ సన్నివేశాలు,హద్దులు దాటిన హింస, ఏర్లుగా పారే రక్తపాతాలే కనిపిస్తున్నాయి. ఓ నదిలా పారే ప్రేమ కథ, పిల్లగాలిలా వీచే స్వచ్చమైన ప్రణయ గీతాలు, గుండెల్ని బరువెక్కించే భగ్న ప్రేమ కథ (love stories) లు రావడం లేదు. ఇలాంటి తరుణంలో ఓ స్వచ్చమైన ప్రేమ కథను అసలు ప్రేమ నిర్వచనాన్ని చెప్పేందుకు ఫణీంద్ర నర్సెట్టి ‘8 వసంతాలు’ మూవీ తీసారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో, ఆడియెన్స్‌కి నచ్చిందో లేదో రివ్యూ లో తెలుసుకుందాం.

కథేంటంటే

8 వసంతాలు చిత్రంలో కథ వెదకడం కంటే ఇదొక ప్రయాణం అని చెప్పడం సబబు.శుద్ధి అయోధ్య (అవంతిక సనీల్ కుమార్) పని పట్ల అకింత భావం, ఏదైనా సాధించగల పట్టుదల, కొండంత ధైర్యం, అంతులేని సాహసాన్ని ప్రదర్శించే ఓ యువ రచయిత్రి. రచనలే కాదు బరిలోకి దిగితే ఎవరినైనా కింద పడగొట్టగల యోధురాలు. మార్షల్ ఆర్ట్స్, బ్లాక్ బెల్ట్‌లో శుద్ది ఆరి తేరిన వ్యక్తి. తండ్రి దూరమైన బాధల్లోంచి రాసిన పుసక్తంతో శుద్ధి (Shuddi) గొప్ప రచయితగా మారుతుంది. నదిలా ప్రవహిస్తున్న శుద్ధి జీవితంలోకి వరుణ్ (హను రెడ్డి) వచ్చి దారి మారేలా చేస్తాడు. అప్పటి వరకు తన ప్రపంచంలో తాను బతుకుతున్న శుద్దిని ప్రేమలోకి దించుతాడు. చివరకు వరుణ్ తన స్వార్థాన్ని చూసుకుని శుద్ధిని నడి రోడ్డున వదిలేసి వెళ్తాడు. స్వాభిమానం, ఆత్మ గౌరవం ఉన్న శుద్ధి ఏం చేస్తుంది? శుద్ధి జీవితంలో సంజయ్ (రవి దుగ్గిరాల) పాత్ర ఏంటి? 8 వసంతాల్లో జరిగిన మార్పులు ఏంటి? ఈ కథలో శుద్ధి స్నేహితులు కార్తిక్, అనిత పాత్రలు ఏంటి? అన్నది కథ.

8 Vasantalu

విశ్లేషణ

జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తన మృదుత్వం కోల్పోకుండా ధైర్యంగా నిలబడిన ఓ అమ్మాయి కథే 8 వసంతాలు. ఒక ప్రేమకథకు కావాల్సిన మంచి సంగీతం, సాహిత్యం, విజువల్ బ్యూటీ అన్నీ సినిమాకి వున్నాయి. ప్రధాన పాత్రలు రచయితలు కావడం వలన కథకు ఓ పోయెట్రీ టచ్ కూడా దొరికింది. ఆలోచింపజేసే సంభాషణలు కుదిరాయి.అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు పదంతో టైటిల్ వచ్చి చాలా కాలమే అవుతుంది. ఫణీంద్ర (Phanindra Narsetti) ఈ కథతో తన నాల్జెడ్ మొత్తాన్ని ప్రదర్శించాలని అనుకున్నాడేమో. అందుకే ప్రతీ డైలాగ్, ప్రతీ సీన్‌ను తనలోని భావాన్ని, అనుభవాన్ని అంతా జోడించి ఓ పోయెటిక్‌గా మలిచాడు. కొన్ని చోట్ల కవి భావం అర్థం అవుతుంది. ఇంకొన్ని చోట్ల ఆ భావం ఎక్కువైందన్న ఫీలింగ్ కలుగుతుంది. మరి కొన్ని చోట్ల ఇప్పుడు ఇంత అవసరమా? అని అనిపిస్తుంది.

Read Also: Kuberaa Movie: ఏపీలో ‘కుబేర’ టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

#8VasantaluReview #PhanindraNarasetti #TeluguCinema #TeluguMovies Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.