ఇవాళ టాలీవుడ్ మాస్ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియాలో అభిమానులు, సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే, చిరంజీవి తన కుమారుడు చెర్రీకి చేసిన ప్రత్యేక పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

చరణ్ బర్త్‌డేకు చిరు స్పెషల్ విషెస్
మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశారు. హ్యాపీ బర్త్‌డే మై డియర్ చరణ్. నీ కెరీర్‌లో ప్రతీ సినిమా కొత్త గమనాన్ని సృష్టిస్తూ వెళ్తుంది. ‘పెద్ది’ ఫస్ట్ లుక్ చూస్తుంటే చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. నీలోని నటుడిని మరో కొత్త కోణంలో ఇది ఆవిష్కరించనుంది. సినిమా ప్రియులకు, అభిమానులకు ఇది ఒక విందుగా ఉంటుందని నేను కచ్చితంగా నమ్ముతున్నాను అంటూ తన ఎమోషనల్ సందేశాన్ని ట్వీట్ చేశారు. ఈరోజు ‘పెద్ది’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమా అభిమానులకు ఒక గ్రాండ్ ట్రీట్ అవుతుందని నమ్ముతున్నా అంటూ చెర్రీకి బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో పూర్తిగా మాస్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఇందులో చరణ్ పాత్ర చాలా శక్తివంతంగా, ఇంటెన్స్‌గా ఉండబోతోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ లీడ్ రోల్ పోషిస్తుండగా, జాన్వీ కపూర్కథానాయికగా నటిస్తోంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తుండటంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తోంది. ఉపాసన తన భర్తకు సోషల్ మీడియాలో క్యూట్ బర్త్‌డే పోస్ట్ షేర్ చేయగా, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి మెగా హీరోలు చెర్రీకి విషెస్ తెలిపారు. రామ్ చరణ్ బర్త్‌డేను అభిమానులు భారీ స్థాయిలో సెలబ్రేట్ చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులో పెద్ద LED స్క్రీన్‌లపై రామ్ చరణ్ సినిమాల స్పెషల్ షోస్ ప్రదర్శిస్తున్నారు.