हिन्दी | Epaper
సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Chicken: అతిగా చికెన్ తింటే పేగు కాన్సర్ కు ఛాన్స్

Ramya
Chicken: అతిగా చికెన్ తింటే పేగు కాన్సర్ కు ఛాన్స్

వారానికి ఎంత చికెన్ తింటున్నారు? ఆరోగ్యంపై ప్రభావం ఏమిటి?

ఒకవైపు చికెన్ రుచికి, ప్రోటీన్ సమృద్ధికి ప్రసిద్ధి. మరోవైపు, దీనిని అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు కూడా ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికాకు చెందిన న్యూట్రియెంట్స్ జర్నల్‌లో పబ్లిష్ అయిన ఓ స్టడీ ప్రకారం, వారానికి ఎన్ని సార్లు, ఎంత పరిమాణంలో చికెన్ తీసుకుంటున్నామన్నదానిపై మన ఆరోగ్యం ఆధారపడి ఉందని తేలింది.

చికెన్ లో ప్రోటీన్లు, విటమిన్ బి12, కొలైన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నరాల వ్యవస్థను మెరుగుపరచడంలో, శరీర బలం పెంపొందించడంలో సహాయపడతాయి. పిల్లలకు కూడా చికెన్ తినిపించడం మంచిదేనని వైద్యులు సూచిస్తున్నారు. కానీ, రుచిలో మునిగిపోతూ చికెన్‌ను అధికంగా తీసుకుంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ సమస్యలు, లివర్ జబ్బులు, కడుపు నొప్పి వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని స్టడీ హెచ్చరిస్తోంది.

వారానికి ఎంత మాంసం తినాలి?

అధ్యయనం ప్రకారం, వారానికి 300 గ్రాములకు మించి చికెన్ తింటే ఆరోగ్యపరంగా ముప్పు ఉండే అవకాశముంది. ఇదే కాక, 200 గ్రాముల చికెన్ తీసుకున్న వారి లో కూడా కొన్ని కేసుల్లో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్ గుర్తించారు. అదీ కాకుండా, అధిక మాంసం తీసుకున్నవారిలో సుమారు 27 శాతం మంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు తేలింది. పురుషుల్లో ఈ రిస్క్ మరింత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

అందుకే, ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే మాంసం తీసుకోవాలని సూచిస్తున్నారు. పరిమిత మోతాదులో, దాదాపు 100 గ్రాముల చికెన్ వారానికి తీసుకుంటే ఆరోగ్యపరంగా ముప్పు ఉండదని అధ్యయనం స్పష్టం చేసింది.

మాంసం బదులు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు

ప్రొటీన్ కోసం చికెన్ మీద మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదు. బీన్స్, బఠాణి, వెజ్ సలాడ్స్, నట్స్ వంటి వాటిని ఆహారంలో చేర్చడం ద్వారా సరిపడా ప్రొటీన్ పొందొచ్చు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి, క్యాన్సర్ వంటి ప్రమాదాలను దూరం చేస్తాయి. ముఖ్యంగా, రెడీమీట్ లేదా ప్రాసెస్‌డ్ మీట్ తినడం తగ్గించుకోవడం వల్ల ఈ ప్రమాదాలు ఇంకా తగ్గుతాయి.

బయట తినే అలవాట్లపై జాగ్రత్తలు

ఇప్పుడు చాలామందికి రెస్టారెంట్లు, హోటల్స్‌లో తినడం అలవాటైంది. వీకెండ్స్, సెలవులు వచ్చేసరికి బయటకెళ్లి ఫ్రెండ్స్‌తో కలిసి బిర్యానీ, చికెన్ ఆర్డర్ చేయడం కామన్. కానీ, బయట తినే మాంసంలో అధికంగా రసాయనాల వాడకం, ప్రాసెసింగ్ వల్ల ప్రమాదం ఇంకా పెరుగుతుంది. అందువల్ల వీలైనంత వరకూ ఇంట్లోనే శుభ్రంగా, తక్కువ మసాలాలతో వండిన చికెన్‌నే తీసుకోవాలి.

మితంగా తింటే ఆరోగ్యమే

చివరగా చెప్పాలంటే, చికెన్ తినడం తప్పు కాదు. కానీ మితిమీరిన వాడకం తప్పనిసరిగా అనారోగ్యానికి దారితీస్తుంది. ఒక్కోసారి తినడం, పరిమిత మోతాదులో తినడం వల్ల మాత్రం శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే డైట్‌లో మాంసం పరిమితంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన మైనరల్‌లు, విటమిన్లు అందుతాయి.

READ ALSO: Patanjali Research: బ్రెస్ట్ క్యాన్సర్‌కు పతంజలి పరిశోధనలో కీలక అంశాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

బొద్దింకల వల్లే ఈ ఆరు భయంకరమైన వ్యాధులు వస్తాయట..

బొద్దింకల వల్లే ఈ ఆరు భయంకరమైన వ్యాధులు వస్తాయట..

దేశంలో పెరుగుతున్న నాడీ సంబంధిత వ్యాధులు..

దేశంలో పెరుగుతున్న నాడీ సంబంధిత వ్యాధులు..

ఐరన్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా?

ఐరన్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా?

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

చలికాలంలో చర్మ సంరక్షణ

చలికాలంలో చర్మ సంరక్షణ

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

అదుపులోకి తీసుకురావడానికి సంపూర్ణ మార్గదర్శకాలు

అదుపులోకి తీసుకురావడానికి సంపూర్ణ మార్గదర్శకాలు

పిజ్జా, ఉల్లిపాయలు, గిన్నెల కోసం యూజ్‌ఫుల్ హోమ్ టిప్స్

పిజ్జా, ఉల్లిపాయలు, గిన్నెల కోసం యూజ్‌ఫుల్ హోమ్ టిప్స్

📢 For Advertisement Booking: 98481 12870