📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Health: క్యాన్సర్ ని ఆమడదూరం ఉంచే పనస

Author Icon By Anusha
Updated: May 8, 2025 • 5:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సమ్మర్‌లో ఎక్కువగా దొరికే పండ్లలో పనస పండు కూడా ఒకటి. బంగారు ఛాయతో, కమ్మటి వాసనతో ఆకర్షించే పనస తొనలంటే ఇష్టపడనివారుండరు. పండిన పనసే కాదు పచ్చికాయతో కూర, బిర్యానీ చేసుకుని ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. పనసపండు టేస్ట్‌ మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పనసపండులో డైటరీ ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, ఫోలేట్, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్‌, జింక్‌, నియాసిన్‌, విటమిన్ ఎ, విటమిన్ సి, థయామిన్, రైబోఫ్లావిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పనసపండు తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.పనసపండులో.. విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants)మెండుగా ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇవి ఇన్‌ఫెక్షన్లు సోకకుండా శరీరాన్ని రక్షిస్తాయి.వంద గ్రాముల పనస తొనలలో 94 కిలో కేలరీలు , మంచి కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పనసపండు తిన్న వెంటనే తక్షణ శక్తిని పొందవచ్చు. పనసపండులోని చక్కెరలు చాలా తేలికగా జీర్ణమవుతాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

హైపర్‌టెన్షన్‌

పనసపండులో పొటాషియం మెండుగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం సమతుల్యను నియంత్రిస్తుంది. శరీరంలో సోడియం స్థాయిలు పెరిగితే ధమనులు, గుండెకు హాని జరుగుతుంది. పొటాషియం గుండె కండరాల పనితీరును సమన్వయం చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పనసపండులోని పొటాషియం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.పనసపండులో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఉత్పత్తి అయ్యే టాక్సిన్స్‌తో పాటు మనకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ రెండూ శరీరంలో క్యాన్సర్‌కు(Cancer) కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్‌ నిరోధకాలుగా పనిచేసే ఫైటో న్యూట్రియంట్స్‌ పనసలో పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్‌ సమస్యని కూడా దూరం చేస్తుంది.పనసపండులో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది, ఇది ఎముకలను బలపరుస్తుంది. దీనిలోని పొటాషియం మూత్రపిండాల ద్వారా కాల్షియం నష్టాన్ని తగ్గిస్తుంది. పనసపండు తింటే ఆస్టియోపోరోసిస్‌ ముప్పు తగ్గుతుంది.

Jackfruit-Benefits

ఇన్ఫెక్షన్‌

పనసపండు శరీరంలోని అసమతుల్యతలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని ఫలితంగా ఆస్తమా ఎటాక్స్‌ను నియంత్రిస్తుంది. ముఖ్యంగా కాలుష్యం కారణంగా వచ్చే ఆస్తమా ఎటాక్స్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆస్తమా దాడులకు దారితీసే కాలుష్యం కారణంగా శరీరంలో ఉత్పత్తి అవుతున్న ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో ఎఫెక్టివ్‌గా సహాయపడుతుంది.పనసపండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్‌ నుంచి కళ్లను రక్షిస్తుంది. హీనికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. విటమిన్‌ ఏ యూవీ కిరణాలు, హానికరమైన కాంతి తరంగాల నుంచి కళ్లను కాపాడుతుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రెటీనా క్షీణతను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

Read Also: Health: ప్రోటీన్ పుష్కలంగా ఉండే కూరగాయలు

#HealthyEating #Jackfruit #NutritiousFood #SeasonalFruits #Superfruit Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.