📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Radish chutney: ముల్లంగి పచ్చడి రుచికి రుచి .. ఆరోగ్యానికి ఆరోగ్యం

Author Icon By Sudha
Updated: July 4, 2025 • 5:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముల్లంగి (Radish)లో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. కడుపు సమస్యలు (stomach problems), గ్యాస్, అజీర్ణం తగ్గించడంలో ఉపయోగపడుతుంది.ముల్లంగి డిటాక్స్ ఫుడ్‌గా పనిచేస్తుంది. విషపదార్థాలను బయటకు తీసి లివర్, కిడ్నీలను శుభ్రంగా ఉంచుతుంది.ముల్లంగి(Radish) గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.ముల్లంగిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీ నియంత్రణకు సహాయపడుతుంది.ముల్లంగి(Radish)లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడంతో చర్మం గ్లో అవుతుంది, మచ్చలు తగ్గుతాయి.

ముల్లంగి పచ్చడి రుచికి రుచి .. ఆరోగ్యానికి ఆరోగ్యం

కావలసిన పదార్దాలు
ముల్లంగి పచ్చడి తయారు చేయడానికి కావలసిన ఒకటి, నూనె: పావు కప్పు, ధనియాలు: ఒక టేబుల్‌ స్పూన్‌, జీలకర్ర: ఒక టీస్పూన్‌, పోపుగింజలు (ఆవాలు, జీలకర్ర, మినుప పప్పు, శనగ పప్పు): రెండు టీస్పూన్లు, ఎండు మిరపకాయలు: పది, వెల్లుల్లి రెబ్బలు: ఐదు, కరివేపాకు: ఒక రెబ్బ, ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది), పసుపు: ఒక టీస్పూన్‌, చింతపండు గుజ్జు: ఒక టేబుల్‌ స్పూన్‌, ఉప్పు: తగినంత.
పచ్చడి తయారు విధానం
ముందుగా ముల్లంగి తొక్కతీసి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి రెండు టేబుల్‌ స్పూన్ల నూనెవేసి వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి రెండు నిమిషాలు సన్నని మంటపై వేయించి తీయాలి. అదే పాన్‌లో మరో టేబుల్‌ స్పూన్‌ నూనెవేసి ముల్లంగి ముక్కలు వేసి సన్నని మంటపై వాసనపోయేలా వేగాక.. అర టీస్పూన్‌ పసుపు వేసి కలిపి దించేయాలి. ముందుగా వేయించుకున్న మిరపకాయల మిశ్రమం, తగినంత ఉప్పు, చింతపండు గుజ్జు మెత్తగా గ్రైండ్‌ చేశాక.. ముల్లంగి ముక్కలు కూడా వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి. దీనికి పోపు పెడితే.. ముల్లంగి పచ్చడి సిద్ధం.

Read Also: hindi.vaartha.com

Read Also:Egg Benefits: గుడ్డులో ఏది మంచి ప్రోటీన్? పరిశోధనలు

#HealthyChutney #HealthyEating #HomeMadeChutney #IndianChutneys #MullangiPachadi #NutritiousFoodradish chutney recipe #RadishChutney #RadishRecipe #SouthIndianFood #TeluguFood Breaking News in Telugu easy radish chutney Google news Google News in Telugu healthy indian chutneys how to make radish chutney Latest News in Telugu mullangi pachadi in telugu Paper Telugu News radish benefits for health radish chutney health benefits radish recipes south indian radish side effects Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.