బొప్పాయి పండును ఆరోగ్యకరమైన ఫలంగా మనందరం గుర్తించాం. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు, చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ఈ పండులోని గింజలు (Papaya Seeds Benifits) కూడా అదే స్థాయిలో, అంతకంటే ఎక్కువగా ఔషధ గుణాలు (Medicinal properties)కలిగి ఉంటాయి. సాధారణంగా మనం వాటిని వాడకుండా పారేస్తాం, కానీ ఆరోగ్య నిపుణుల చెబుతూనే ఉన్నారు – బొప్పాయి గింజలను కూడా ఆహారంలో భాగంగా వాడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
బరువు తగ్గుదలకు
బొప్పాయి గింజల్లో (Papaya Seeds Benifits) ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, పేగు కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే, గింజల్లో ఉండే ‘కార్పైన్’ అనే పదార్థం పేగుల్లోని బ్యాక్టీరియా, పరాన్నజీవులను చంపి, జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది.
బొప్పాయి గింజల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతుంది. ఇవి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి, బరువు తగ్గుదలకు సహాయపడతాయి. వీటిలోని ఒలీక్ యాసిడ్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బొప్పాయి గింజల్లో పాలిఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించి, క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తాయి. ముఖ్యంగా, ‘ఐసోథియోసైనేట్’ అనే పదార్థం క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డుకుంటుంది.
బ్యాక్టీరియాను నాశనం చేయడానికి
కొన్ని అధ్యయనాల ప్రకారం, బొప్పాయి గింజలు (Papaya Seeds Benifits) కిడ్నీలలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి వాటి పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు కిడ్నీ కణాలకు నష్టం జరగకుండా కాపాడతాయి. అలాగే బొప్పాయి గింజలు డెంగీ వ్యాధిలో తగ్గే ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ గింజలను పొడి చేసి తీసుకుంటే డెంగీ నుండి త్వరగా కోలుకోవచ్చు. వీటితో పాటు, బొప్పాయి గింజలు పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి, కాలేయ సమస్యలను నివారించడానికి, ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడానికి కూడా ఉపయోగపడతాయి. వీటిని పొడిగా చేసి సలాడ్లలో లేదా జ్యూస్‌లలో కలుపుకొని తీసుకోవచ్చు. అయితే, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని వాడే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
బొప్పాయి గింజలు తినడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా?
విత్తనాలలోని కొన్ని సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్లు మరియు ఫినోలిక్ ఆమ్లాలు వంటివి కాలేయ ఆరోగ్యం మరియు పనితీరుకు తోడ్పడతాయి. బొప్పాయి గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరంలో మంటను తగ్గించడంలో మరియు తాపజనక పరిస్థితుల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి.
బొప్పాయి గింజలను మనం నేరుగా తినవచ్చా?
బొప్పాయి గింజలు తినదగినవి, కానీ అవి బలమైన, మిరియాల రుచిని కలిగి ఉంటాయి, దీనిని కొందరు ఇష్టపడరు. విషపూరితం కానప్పటికీ, జీర్ణ సమస్యలు మరియు సైనైడ్ యొక్క ట్రేస్ మొత్తాల ఉనికి కారణంగా వాటిని మితంగా తినాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Green coffee: గ్రీన్ టీ కంటే గ్రీన్ కాఫీ మేలు..ఎందుకంటే?