డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉంటాయి. ఇవి శరీరంలోకి రోగాలు రాకుండా కాపాడుతాయి. వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి. ఈ పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యల్ని, మలబద్ధకం వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. వీటితో పాటు,డ్రాగన్ ఫ్రూట్‌లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎముకలు బలంగా మారతాయి.గుండె ఆరోగ్యానికి డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిది. దీనిని తినడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దీనిని తింటే రక్తం గడ్డ కట్టే ప్రమాదం కూడా తగ్గుతుంది.డ్రాగన్ ఫ్రూట్‌లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ని నాశనం చేసి క్యాన్సర్‌ని తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
డ్రాగన్ ఫ్రూట్స్
ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీనిని తీసుకుంటే కడుపు నిండుగా ఉండి కేలరీలని తక్కువగా తీసుకుంటాం. దీంతో ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. అదే విధంగా, డ్రాగన్ ఫ్రూట్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇది డయాబెటిస్ ఉన్నవారు కూడా తినొచ్చు.ఈ పండు తినడం వల్ల చర్మం మెరుగ్గా అవుతుంది. దీనిలోని విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి, హ్యాపీగా తినొచ్చు. అంతేకాకుండా దీనిని తినడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఆనారోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది.సాచురేటెడ్ కొవ్వులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె బలంగా ఉంటుంది. హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో బీటాసయానిన్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి కూడా శరీరానికి అందుతుంది. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీంతో క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది.
ఇన్ఫెక్షన్ల
డ్రాగన్ ఫ్రూట్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది.జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.వైరస్‌లు, బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించడంలో డ్రాగన్ ఫ్రూట్ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ పండు తినడం ద్వారా రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ఒత్తిడి, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి. ఎండాకాలంలో ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది.ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి సహాయపడతాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ముడతలు ఏర్పడకుండా ఉంటాయి. వయసు పెరిగినా చర్మం కాంతివంతంగా, యవ్వనం ఉట్టిపడేలా ఉంటుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read Also :Health: వేసవిలో శక్తినిచ్చే ఉల్లిపాయ