📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Bathing Tips: స్నానం ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసా..?

Author Icon By Anusha
Updated: May 2, 2025 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతిరోజూ స్నానం చేయడం అందరికీ అలవాటు. మంచి ఆరోగ్యానికి రోజూ స్నానం చేయడం చాలా అవసరం. స్నానం శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా, రిఫ్రెష్ చేస్తుంది. అయితే, భారతదేశంలో చాలా మంది ఉదయం స్నానం చేస్తారు. అదే చైనా, జపాన్, కొరియా వంటి దేశాల ప్రజలు రాత్రిపూట స్నానాలు చేస్తారు. అయితే, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఉదయం లేదా సాయంత్రం స్నానం ఎప్పుడు చేస్తే మంచిది? సైన్స్ నిజంగా ఏం చెబుతుంది. ఆయుర్వేదం ఏం చెబుతుందో తెలుసుకుందాం.భోజనం చేసిన తర్వాత కూడా స్నానం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత, ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి కడుపుకు ఎక్కువ శక్తి, సరైన మొత్తంలో శరీర ఉష్ణోగ్రత అవసరం. కానీ, భోజనం తరువాత స్నానం చేయటం వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. దీనివల్ల ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే భోజనం చేసిన గంట లేదా గంటన్నర తర్వాత తలస్నానం చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు.

నిపుణులు

జపాన్‌లో చాలా మంది సాయంత్రం, రాత్రి స్నానం చేస్తుంటారు. ఇక్కడ రాత్రి స్నానం చేసే ఆచారం వారికి పురాతన సంప్రదాయంగా పాటిస్తుంటారు. రాత్రి పూట స్నానం చేయడం వల్ల పగటిపూట శరీరంపై పేరుకుపోయిన విషవ్యర్థాలు, మురికిని తొలగిపోతుందని నమ్ముతారు.అదేవిధంగా, దక్షిణ కొరియాలో కూడా ఎక్కువ గంటలు పనిచేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ప్రజలు రాత్రిపూట స్నానం చేస్తుంటారు. కానీ,  అమెరికా, యూరప్, కెనడా వంటి దేశాలలో మాత్రం ప్రజలు ఎక్కువగా  ఉదయం పూట స్నానం చేస్తారు.చైనీస్ లో కూడా ప్రజలు రాత్రిపూట స్నానం చేస్తుంటారు.  రోజంతా పని చేసి అలిసిపోయిన తరువాత సాయంత్రం స్నానం చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుందని చైనీయులు నమ్ముతారు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే, చైనా వాతావరణం తేమగా, ఉష్ణమండలంగా ఉండటం ఒక కారణం. అందుకే అక్కడ జనాలకు బాగా చెమటలు పడతాయి. దీని వల్ల వారికి అనేక రకాల చర్మ వ్యాధులు వస్తాయి. అందుకే, వారు రాత్రిపూట స్నానం చేస్తారు.

వేడినీటి

సైన్స్ ప్రకారం, రాత్రిపూట స్నానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత స్నానం చేయడం వల్ల శరీరం ఉత్తేజంగా ఉంటుంది. రాత్రి స్నానం చేయడం వల్ల పగటిపూట కలిగే అలసట నిమిషాల్లో మాయమవుతుంది. బాగా నిద్రపడుతుంది కూడా. అందుకే చాలా మంది ఉదయం పూటనే కాదు, రాత్రిపూట కూడా స్నానం చేస్తారు. రాత్రి పడుకునే ముందు వేడినీటి స్నానం చేయడం వల్ల బాగా నిద్రపోతుందని పరిశోధనలో తేలింది. అయితే, ఉదయం స్నానం కూడా ముఖ్యం. ముఖ్యంగా రోజంతా చురుకుగా ఉండాలనుకునే వారికి ఉదయాన్నే స్నానం చేయడం తప్పనిసరి.

Read Also: Health: ప్రతి రోజూ కీరదోస తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

#AvoidBathAfterEating #AyurvedaTips #DigestionFacts #HealthyHabits #PostMealTips Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.