📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

పుచ్చకాయల్లో కల్తీని ఎలా గుర్తించాలో తెలుసా!

Author Icon By Anusha
Updated: March 9, 2025 • 2:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచే అద్భుతమైన పండు పుచ్చకాయ. ఈ పండును పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. కానీ, మార్కెట్‌లో దొరికే కొన్ని పుచ్చకాయలు ఆరోగ్యానికి హానికరం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని వ్యాపారులు కల్తీ రసాయనాలను ఉపయోగించి పుచ్చకాయలను ఆకర్షణీయంగా మార్చి అమ్ముతున్నారు.

కల్తీ పుచ్చకాయ

పుచ్చకాయలను త్వరగా పండించేందుకు వ్యాపారులు కార్బైడ్ ఇంజెక్షన్లు చేస్తున్నారు. దీని వల్ల పండు త్వరగా పండినట్టు కనిపిస్తుంది కానీ, పోషక విలువలు తగ్గిపోతాయి. అంతేకాదు, పుచ్చకాయ లోపల ఎర్రగా కనిపించేందుకు “ఎరిథ్రోసిన్” అనే రసాయనాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇది సాధారణంగా ఆహార రంగుల్లో ఉపయోగించే నిషేధిత రసాయనంగా గుర్తించబడింది.

అనారోగ్య సమస్యలు

నిపుణుల సూచనల ప్రకారం, కల్తీ చేసిన పుచ్చకాయలు తింటే కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశం ఉంది. ఎరిథ్రోసిన్ అధికంగా శరీరంలోకి చేరితే క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదనంగా, దీని వల్ల కాలేయ (లివర్) సమస్యలు, మూత్రపిండాల దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.కడుపు సమస్యలు, రక్తహీనత, మెదడు దెబ్బతినటం, సంతానోత్పత్తి తగ్గటం వంటి సమస్యలను కలిగిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లను తింటాం. కానీ మనం తినే పండ్లు శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే లాభం కోసం పండ్లపై రసాయనాలు వాడుతున్నారు. రసాయన రహిత పండ్లు తినటం మాత్రమే ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా పుచ్చకాయలో రంధ్రాలు ఉంటే కొనకపోవడమే మంచిది. రుచిని జోడించడానికి సిరింజీలు వేసి ఉండవచ్చు. అది కల్తీ పుచ్చకాయ అయితే మీరు దానిని కోసినప్పుడు పండ్లలో ఎక్కువ పగుళ్లు ఉంటాయి. అందువల్ల పుచ్చకాయ కొనేటప్పుడు కొన్న తర్వాత ఈ దశలను పాటిస్తే అది మంచిదా చెడ్డదా అని మీరు సులభంగా గుర్తించవచ్చని నిపుణులు అంటున్నారు.

కల్తీని గుర్తించడానికి టెస్ట్

కట్ చేసిన పుచ్చకాయ ముక్క లోపలి భాగాన్ని టిష్యూ పేపర్ లేదా కాటన్ బాల్ తో సున్నితంగా రుద్దండి. టిష్యూ పేపర్ రుద్దినప్పుడు రంగు మారితే అది కల్తీ పుచ్చకాయ అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెబుతోంది. అది స్వచ్ఛమైన పుచ్చకాయ అయితే దాని రంగు మారదు. ఈ సింపుల్ టిప్ ద్వారా కల్తీ పుచ్చకాయను ఈజీగా గుర్తించవచ్చని ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ అధికారులు తెలిపారు. పుచ్చకాయలో అక్కడక్కడా కొద్దిగా తెలుపు, పసుపు ఉంటే అది కల్తీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

కార్బైడ్ రసాయనం

పుచ్చకాయలను త్వరగా పండించడానికి కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. అందువల్ల పుచ్చకాయ పైభాగంలో పసుపు రంగు కనిపిస్తే తినడానికి ముందు ఉప్పునీటిలో బాగా కడగడం మంచిది. పుచ్చకాయ కొనేటప్పుడు మీరు దానిని జాగ్రత్తగా పరిశీలించాలి. రసాయనాలతో చేసిన పండ్లను తినడం వల్ల కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. మితిమీరిన కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.

మార్కెట్లో పుచ్చకాయ కొనేటప్పుడు అది స్వచ్ఛమైనదో కాదో గుర్తించటం తప్పనిసరి. ఎందుకంటే మార్కెట్లోకి కల్తీ పండ్లు వచ్చాయి. చూడటానికి ఎర్రగా ఉన్నాయని పండ్లను తినకండి. ముందు అవి స్వచ్ఛమైనవో కాదో గుర్తించాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కల్తీ పుచ్చకాయను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మొదట పుచ్చకాయ కొన్నప్పుడు ఒక చిన్న ముక్కను కట్ చేసి మీకు ఇవ్వమని అడగండి.

#AvoidAdulteration #FoodSafety #StayHealthy #SummerFruits #Watermelon Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.