మన శరీరంలో కిడ్నీల పాత్ర ప్రధానమైనది. ఇవి శరీరంలోని వ్యర్థాలను, మలినాలను బయటకు పంపిచడానికి తోడ్పడుతాయి. ఇవి సమర్థంగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే చాలా మంది హార్ట్, లివర్ హెల్త్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా, కిడ్నీల విషయానికి వచ్చే సరికి నిర్లక్షం చేస్తారు. ఫలితంగా మూత్రపిండాల్లో రాళ్లు సహా ఇతర సమస్యలు వేధిస్తాయి. ఈ క్రమంలోనే కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు(Doctors) చెబుతున్నారు.కిడ్నీలు బాగా పనిచేయాలంటే మనం మన అలవాట్లు, తిండి, ఎక్సర్‌సైజ్‌ల మీద శ్రద్ధ పెట్టాలి. మంచి తిండి తినడం, ప్రతిరోజూ కొంచెం కష్టపడి పనిచేయడం వల్ల కిడ్నీల ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం కిడ్నీలకు మంచి చేసే కొన్ని తేలికపాటి ఎక్సర్‌సైజ్‌లను, వాటి వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
నడవడిక
ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు నడవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా నడవడం వల్ల మన గుండె బాగా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటేనే శరీరం మొత్తానికి రక్తం సరఫరా సక్రమంగా జరుగుతుంది. గుండె సరిగ్గా కొట్టుకుంటేనే రక్తం అన్ని భాగాలకు అందుతుంది. దానివల్ల కిడ్నీలకు కావలసిన ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా చేరుతాయి. నడవడం వల్ల రక్తంలో చక్కెర లెవెల్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. ఇది కిడ్నీలను పాడు చేసే షుగర్, బీపీ(Sugar, BP) లాంటి రోగాలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.ఈత మన శరీరంలోని ముఖ్యమైన కండరాలన్నిటినీ కదిలిస్తుంది. ఇది మన ఊపిరితిత్తులు బాగా పని చేయడానికి సహాయపడుతుంది.ఈత కొట్టడం వల్ల గుండె, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దానివల్ల షుగర్, ఎక్కువ బీపీ లాంటి సమస్యలు తగ్గుతాయి.కాబట్టి వారానికి 2 నుంచి 3 సార్లు ఈత కొట్టడం కిడ్నీలకు చాలా మంచిది. ఈ ఎక్సర్‌సైజ్ కిడ్నీలు బాగా పని చేసేలా చేస్తుంది.
బరువులు
నెమ్మదిగా సైకిల్ తొక్కడం రక్తంలో చక్కెర లెవెల్‌ను బ్యాలెన్స్ చేసే మంచి ఎక్సర్‌సైజ్. ఇది మన గుండెను బలంగా చేస్తుంది.కిడ్నీలకు సరిగ్గా రక్తం అందుతుంది. కాబట్టి కిడ్నీలు బాగా పనిచేస్తాయి. వారానికి రెండు మూడు సార్లు సైకిల్ తొక్కడం మన ఆరోగ్యానికి చాలా లాభం.బరువులు ఎత్తే ఎక్సర్ సైజ్‌లు మన కండరాలను బలంగా చేస్తాయి.ఇది మన ఒంట్లో రక్తంలోని చక్కెర లెవెల్ ను కంట్రోల్ చేస్తుంది.దానివల్ల కిడ్నీలు కూడా సురక్షితంగా ఉంటాయి. వారానికి రెండు సార్లు ఈ ఎక్సర్‌సైజ్‌లు చేయడం మంచిది.యోగా చేయడం వల్ల మన శరీరం, మనస్సు బ్యాలెన్స్‌గా ఉంటాయి. కొన్ని యోగాసనాలు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి, మన ఊపిరితిత్తులు బాగా పని చేస్తాయి. కిడ్నీలు బాగా పనిచేయడానికి యోగా సహాయపడుతుంది. రోజూ కాసేపు యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మనశ్శాంతి కలుగుతుంది.
Read Also: Mobile Phone : దిండు దగ్గర మొబైల్ ఫోన్ పెట్టుకుంటే ప్రమాదకరమా?