📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Bloating : గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య‌కు వంటింటి చిట్కాలు

Author Icon By Sudha
Updated: July 11, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య స‌హ‌జంగానే చాలా మందికి ఉంటుంది. గ్యాస్ ( Bloating)రావ‌డం అన్న‌ది ఎవ‌రికైనా సాధార‌ణ‌మే. కొంద‌రికి నోట్లో నుంచి త్రేన్పుల రూపంలో గ్యాస్ ( Bloating)బ‌య‌ట‌కు పోతుంది.
గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. స‌రైన టైముకు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం (Not eating on time,) అతిగా తిన‌డం, రాత్రి పూట ఆల‌స్యంగా తిన‌డం, ఎక్కువ సేపు మేల్కొని ఉండ‌డం, ఉద‌యం ఆల‌స్యంగా నిద్ర‌లేవ‌డం, గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తూ ఉండడం, శీత‌ల పానీయాల‌ను అధికంగా సేవించ‌డం, కారం, మ‌సాలాలు ఉండే ఆహారాల‌ను అధికంగా తిన‌డం, ప‌లు ర‌కాల మందుల‌ను వాడ‌డం వ‌ల్ల కూడా గ్యాస్ స‌మ‌స్య వ‌స్తుంది. అయితే గ్యాస్ ( Bloating)స‌మ‌స్య ఉంటే చాలా మంది మెడిసిన్ల‌ను వాడుతారు. కానీ వాటితో ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తోనే స‌హ‌జ‌సిద్ధంగా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Bloating : గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య‌కు వంటింటి చిట్కాలు

అల్లం అద్భుతంగా ప‌నిచేస్తుంది

గ్యాస్ స‌మ‌స్య ఉన్న‌వారికి అల్లం అద్భుతంగా ప‌నిచేస్తుంది. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ‌లో ఎంజైమ్‌లు ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. దీంతో మ‌నం తిన్న ఆహారం సుల‌భంగా జీర్ణం అవుతుంది. అల్లంలో యాంటీ స్పాస్మోడిక్ గుణాలు ఉంటాయి. ఇది పేగుల కండ‌రాల‌ను ప్ర‌శాంత ప‌రుస్తుంది. గ్యాస్ సుల‌భంగా బ‌య‌ట‌కు వెళ్లేలా చేస్తుంది. చిన్న అల్లం ముక్క‌ను భోజ‌నం చేసిన అనంత‌రం తింటుండాలి. లేదా భోజనానికి ముందు 1 టీస్పూన్ మోతాదులో అల్లం ర‌సం సేవించవ‌చ్చు. భోజ‌నం అనంత‌రం చిన్న అల్లం ముక్క‌ను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీళ్ల‌ను తాగ‌వ‌చ్చు. ఇలా అల్లాన్ని తీసుకున్నా కూడా గ్యాస్ స‌మ‌స్య త‌గ్గిపోతుంది. అలాగే భోజ‌నం చేసిన అనంత‌రం సోంపు గింజ‌ల‌ను తింటున్నా కూడా ఆహారం సుల‌భంగా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్ ఏర్ప‌డదు. జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. సోంపు గింజ‌ల‌ను వేసి మ‌రిగించిన నీళ్ల‌ను తాగుతున్నా కూడా ఉప‌యోగం ఉంటుంది. గ్యాస్ స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో సోంపు గింజ‌లు అద్భుతంగా ప‌నిచేస్తాయి.

జీల‌క‌ర్ర

వాములో శ‌క్తివంత‌మైన కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. ఈ గింజ‌ల్లో థైమోల్ ఉంటుంది. ఇది జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది. గ్యాస్ స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుంది. క‌డుపు ఉబ్బ‌రం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించేలా చేస్తుంది. భోజ‌నం చేసిన అనంత‌రం ఒక టీస్పూన్ వాము గింజ‌ల‌ను కాస్త న‌ల్ల ఉప్పుతో క‌లిపి నేరుగా అలాగే తిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగాలి. లేదా వాము గింజ‌ల‌ను వేసి మ‌రిగించిన నీళ్ల‌ను కూడా తాగ‌వ‌చ్చు. దీంతో స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అన్ని జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో జీల‌క‌ర్ర కూడా బాగానే ప‌నిచేస్తుంది. జీల‌క‌ర్ర‌ను కాస్త తీసుకుని పెనంపై వేయించి పొడిగా చేయాలి. దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ మ‌జ్జిగ‌లో క‌లిపి తాగాలి. లేదా జీల‌క‌ర్ర‌ను వేసి మ‌రిగించిన నీళ్ల‌ను తాగుతున్నా కూడా గ్యాస్ స‌మ‌స్య త‌గ్గిపోతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది.

Bloating : గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య‌కు వంటింటి చిట్కాలు

పుదీనా ఆకుల రసం

మ‌నం వంట‌ల్లో వాడే ఇంగువ గ్యాస్ స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుంది. ఇందులో యాంటీ ఫ్లాటులెంట్ గుణాలు ఉంటాయి. ఇంగువ‌ను కొద్దిగా తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తాగాలి. లేదా మీరు చేసే కూర‌ల్లో ఇంగువ‌ను వేస్తుండాలి. దీంతో గ్యాస్ రాకుండా అడ్డుకోవ‌చ్చు. జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో పుదీనా ఆకులు కూడా బాగానే ప‌నిచేస్తాయి. పుదీనా ఆకుల ర‌సాన్ని మ‌జ్జిగ‌లో క‌లిపి తాగుతుంటే గ్యాస్ త‌గ్గుతుంది. లేదా పుదీనా ఆకుల‌ను నేరుగా న‌మిలి తిన‌వ‌చ్చు. భోజ‌నం చేసిన అనంతరం ఒక ల‌వంగాన్ని నోట్లో వేసుకుని న‌మిలి తినాలి. ఇది కూడా ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తుంది. గ్యాస్ స‌మస్య‌ను త‌గ్గిస్తుంది. ఇలా స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించి గ్యాస్ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దీంతో జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా కూడా ఉంటుంది.

కడుపు ఉబ్బరం కారణాలు?

ఉబ్బరం రావడానికి ఒక సాధారణ కారణం మలబద్ధకం . మీకు మలబద్ధకం ఉండవచ్చు మరియు దానిని గ్రహించకపోవచ్చు, ఎందుకంటే మీరు సాధారణంగా చేసే దానికంటే తక్కువ మలవిసర్జనలు కలిగి ఉండటం మలబద్ధకం యొక్క ఒక లక్షణం మాత్రమే. మీకు క్రమం తప్పకుండా మలవిసర్జనలు ఉన్నప్పటికీ మీకు మలబద్ధకం ఉండవచ్చు.

ఉబ్బరాన్ని ఎలా తొలగించుకోవాలి?

చమోమిలే అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ హెర్బ్, ఇది ఉబ్బరం వల్ల కలిగే వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. టీ యొక్క వెచ్చదనం శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది. కొన్ని ఓవర్ ది కౌంటర్ మందులు ఉబ్బరం నుండి తాత్కాలికంగా ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ప్రజలు ఉపయోగించే సాధారణ యాంటాసిడ్లలో పెప్టో బిస్మల్, గ్యాస్-ఎక్స్ మరియు టమ్స్ ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Instant coffee: ఇన్‌స్టంట్ కాఫీలతో కళ్లకు ప్రమాదం..జాగ్రత్త

bloating Breaking News digestion gas trouble home remedies latest news telugu health tips Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.