📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

Latest Telugu news: Barley Water – బార్లీ గింజ‌ల నీళ్ల‌తో అద్బుత‌మైన ప్ర‌యోజ‌నాలు

Author Icon By Sudha
Updated: September 2, 2025 • 5:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆరోగ్యంగా ఉండ‌డం కోసం చాలా మంది ర‌క‌ర‌కాల పానీయాల‌ను తాగుతుంటారు. అయితే కొన్ని ర‌కాల పానీయాలు మ‌న‌కు చాలా సుల‌భంగా అందుబాటులో ఉంటాయి. ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను (Health benefits)అధికంగా అందిస్తాయి. కానీ అలాంటి వాటి గురించి చాలా మందికి తెలియ‌దు. వాటిల్లో బార్లీ నీళ్లు కూడా ఒక‌టి. బార్లీ గింజ‌ల‌ను నీటిలో (Barley Water) వేసి మ‌రిగించి ఈ నీళ్ల‌ను త‌యారు చేస్తారు. ఈ నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. బార్లీ గింజ‌ల్లో (Barley Water) అనేక పోష‌కాలు, ఔష‌ధ విలువ‌లు ఉంటాయి. ఇవి ప‌లు వ్యాధుల‌ను న‌యం చేస్తాయి. గుప్పెడు బార్లీ గింజ‌ల‌ను తీసుకుని నీటిలో వేసి మ‌రిగించి ఆ నీటిని వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా ఉండగానే అందులో కాస్త తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగేయాలి. ఇలా చేస్తుంటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. బార్లీ గింజ‌ల్లో (Barley Water) బీటా గ్లూకాన్ ఉంటుంది. ఇది ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు వేగంగా పెర‌గ‌కుండా అడ్డుకుంటుంది. క‌నుక షుగ‌ర్ ఉన్న‌వారు ఈ నీళ్ల‌ను తాగితే మేలు జ‌రుగుతుంది. డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. అయితే తేనె క‌ల‌ప‌కుండా నీళ్ల‌ను తాగాలి.

Barley Water – బార్లీ గింజ‌ల నీళ్ల‌తో అద్బుత‌మైన ప్ర‌యోజ‌నాలు

బ‌రువు త‌గ్గేందుకు

బార్లీ గింజ‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది ప్రీ బ‌యోటిక్ ఆహారంగా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. తిన్న ఆహారం సుల‌భంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం సుల‌భంగా శోషించుకునేలా చేస్తుంది. దీంతో అజీర్తి, గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా మారుతుంది. బార్లీ గింజ‌ల్లో చాలా త‌క్కువ క్యాల‌రీలు ఉంటాయి. క‌నుక ఈ గింజ‌ల‌తో నీళ్ల‌ను త‌యారు చేసి తాగితే క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. అతిగా ఆహారం తింటున్న‌వారు బార్లీ నీళ్ల‌ను రోజూ తాగుతుంటే ఫ‌లితం ఉంటుంది.

హార్ట్ ఎటాక్ రాకుండా

బార్లీ గింజ‌ల్లో ఉండే బీటా గ్లూకాన్ శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీంతో ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించ‌వ‌చ్చు. బార్లీ నీటిలో అద్భుత‌మైన డిటాక్సిఫ‌యింగ్ గుణాలు ఉంటాయి. ఈ నీళ్లు క్లీనింగ్ ఏజెంట్‌గా కూడా ప‌నిచేస్తాయి. ఈ నీళ్ల‌ను తాగితే శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. బార్లీ నీళ్లు స‌హ‌జ‌సిద్ధ‌మైన డైయురెటిక్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటాయి. క‌నుక శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌తోపాటు ఎక్కువ‌గా ఉన్న నీరు కూడా బ‌య‌ట‌కు పోతుంది. దీంతో బ‌రువు త‌గ్గుతారు. అలాగే కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. కిడ్నీల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. బార్లీ గింజ‌ల నీళ్ల‌ను రోజూ తాగుతుంటే కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

Barley Water – బార్లీ గింజ‌ల నీళ్ల‌తో అద్బుత‌మైన ప్ర‌యోజ‌నాలు

రిఫ్రెషింగ్ డ్రింక్‌లా

బార్లీ గింజ‌ల్లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా అనేక ర‌కాల బి విట‌మిన్ల‌తోపాటు ఐర‌న్‌, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీరానికి శ‌క్తిని అందించ‌డంతోపాటు మెట‌బాలిజం మెరుగు ప‌డేలా చేస్తాయి. దీంతో క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి. కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. బార్లీ నీళ్లు స‌హ‌జ‌సిద్ధ‌మైన రిఫ్రెషింగ్ డ్రింక్‌లా కూడా ప‌నిచేస్తాయి. ఈ నీళ్ల‌ను త‌యారు చేసిన త‌రువాత కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి తాగితే శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది. వ్యాయామం, శారీర‌క శ్ర‌మ చేసిన త‌రువాత ఇలా తాగితే వెంట‌నే శ‌క్తి ల‌భించి ఉత్సాహంగా మారుతారు. శ‌రీరం కోల్పోయిన ద్ర‌వాలు, ఎల‌క్ట్రోలైట్స్‌ను తిరిగి పొందుతుంది. బార్లీ గింజ‌ల‌ను మ‌రిగించే ముందు నీటితో శుభ్రంగా క‌డ‌గాలి. అర క‌ప్పు గింజ‌ల‌కు 4 లేదా 5 క‌ప్పుల నీళ్ల‌ను పోయాలి. స్ట‌వ్‌ను సిమ్‌లో ఉంచి 10 నుంచి 15 నిమిషాల పాటు మ‌రిగించాలి. దీంతో నీళ్లు రెడీ అవుతాయి. ఈ నీళ్ల‌ను వ‌డ‌క‌ట్టిన త‌రువాత గోరు వెచ్చ‌గా ఉండ‌గానే రుచి కోసం తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగ‌వ‌చ్చు. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

బార్లీ వాటర్ హిస్టరీ?

దాదాపు 2000 సంవత్సరాలుగా బార్లీ నీరు ఎలుసినియన్ మిస్టరీస్ యొక్క పవిత్ర పానీయం, ఇది పురాతన గ్రీకు మతపరమైన పంట వేడుక.

బార్లీ యొక్క ప్రధాన ఉపయోగాలు ఏమిటి?

బార్లీని ప్రధానంగా మాల్ట్ మరియు బీర్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు, మరియు రెండవది పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. దీనిని మానవ వినియోగానికి ఆహారంగా మరియు బయో ఇంధనం మరియు ఆల్గే నియంత్రణ వంటి ఇతర ఉపయోగాలకు కూడా ఉపయోగిస్తారు. ఈ ఉపయోగాలు మరియు ప్రక్రియలపై సమాచారాన్ని సంస్థలు, విశ్వవిద్యాలయం, USDA మరియు ప్రైవేట్ పరిశోధన ప్రయోగశాలలు మరియు పరిశ్రమలు అందిస్తాయి.

బార్లీ ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు?

బార్లీ సాంప్రదాయకంగా యునైటెడ్ స్టేట్స్‌లో ఉత్పత్తి చేయబడిన అతి ముఖ్యమైన ఫీడ్ ధాన్యపు పంటలలో ఒకటి, కానీ ఇటీవల దాని స్థానంలో ఎక్కువగా మొక్కజొన్న వచ్చింది. యుఎస్‌లో, పండించిన బార్లీలో ఎక్కువ భాగం మాల్ట్ ఉత్పత్తికి ఉపయోగించబడుతుంది. మిగిలినది పశువుల మేత కోసం లేదా మానవ ఆహారం కోసం ఉపయోగించబడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/moong-dal-health-benefits/health/539658/

barley barley water Breaking News detox drink digestion health benefits latest news natural remedies Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.