हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Summit: వేవ్స్ సమ్మిట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చైతూ, శోభిత

Anusha
Summit: వేవ్స్ సమ్మిట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చైతూ, శోభిత

నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్టైన్మెంట్‌ సమ్మిట్‌ -వేవ్స్ జ‌ర‌గ‌నుండ‌గా, ముంబై వేదికగా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అట్టహాసంగా ప్రారంభ‌మైంది. భారతీయ సినీ, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాలకు గ్లోబల్ ప్రాముఖ్యత తీసుకురావడమే ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశ్యం.ఈ సమ్మిట్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ , మహారాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ మహాసమ్మేళనం, ప్రపంచవ్యాప్తంగా సినీ, టెలివిజన్,ఓటిటి, మ్యూజిక్, గేమింగ్ రంగాల నుంచి ప్రముఖులను ఒకే వేదికపైకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రొడక్షన్ హౌస్‌లు, ఓటిటి జెయింట్‌లు, ఫిల్మ్ ఫెస్టివల్ కమీషనర్లు, సినీ తారలు తదితరులు పాల్గొంటున్నారు. వినూత్న సాంకేతికత, వర్చువల్ ప్రొడక్షన్, ఏఐ ఆధారిత కథా రచన, భవిష్యత్తు సినిమా దిశగా భారత ప్రస్థానం వంటి అంశాలపై ప్యానెల్ చర్చలు జరుగుతున్నాయి. భారతీయ కంటెంట్‌ను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేందుకు ప్రత్యేక సమావేశాలు, బిజినెస్ టు బిజినెస్ (బి2బి) సమావేశాలు జరుగుతున్నాయి.

పరిశ్రమ

భారతీయ వినోద పరిశ్రమ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. ‘కనెక్టింగ్‌ క్రియేటర్స్‌ కనెక్టింగ్‌ కంట్రీస్‌’ అనే నినాదంతో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రారంభ వేడుకలకు భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలు, ప్రముఖ తారలు హాజరై సందడి చేశారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా వంటి అనేక మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ముఖ్యంగా టాలీవుడ్ నుంచి యువ నటుడు నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నాగచైతన్య బ్లాక్ సూట్‌లో స్టైలిష్‌గా కనిపించగా, శోభిత సంప్రదాయ చీరకట్టులో నుదుటన బొట్టుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరి తాజా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  Summit: వేవ్స్ సమ్మిట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చైతూ, శోభిత

శిఖ‌రాల‌కి

ఈ సదస్సును ప్రధాని మోదీ గురువారం ప్రారంభించ‌గా, కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. వేవ్స్ అనేది కేవలం ఒక పదం కాదని ఇది సంస్కృతి, సృజనాత్మకత, చలనచిత్ర సంగీతం, గేమింగ్, కథ చెప్పడం.. లాంటి కలయిక అంటూ వివ‌రించారు. గ‌త వందేళ్ల‌లో భార‌తీయ సినిమా ఉన్న‌త శిఖ‌రాల‌కి కూడా చేరుకుంద‌ని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు.

Read Also: Richest Actors: ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన నటులు ఎవరో తెలుసా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870