Center is good news for chilli farmers

మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం

న్యూఢిల్లీ: ఏపీలో మర్చిధరలు పడిపోవడంతో రైతుల్ని ఆదుకోవడానికి కేంద్రాన్ని చంద్రబాబు రంగంలోకి దించారు. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం కనీస ధరను రూ. 11,781 గా నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. క్వింటా మిర్చికి ఈ ధర వర్తిస్తుంది. ధరలు భారీగా పడిపోవడంతో రైతులు నష్టానికి అమ్ముకుంటున్నారు. ఇక నుంచి సాగు ఖర్చు.. అమ్మకపు వ్యయం మధ్య వ్యత్యాన్ని కేంద్రం చెల్లిస్తుంది.

Advertisements
మిర్చి రైతులకు కేంద్రం గుడ్

నెలపాటు ఈ ఉత్తర్వులు అమల్లో

మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద కేంద్ర ప్రభుత్వం ఈ ధర ప్రకటించింది. 2.58లక్షల మెట్రిక్‌ టన్నుల మిర్చి సేకరణకు అవకాశం కల్పించింది. నెలపాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి. మిర్చి రైతుల ఇబ్బందులపై ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో పాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తోనూ మాట్లాడారు. ఈ నేపథ్యంలో కేంద్రం మిర్చికి ధర ప్రకటించింది.

మార్కెట్ యార్డుకు వెళ్లి రైతులకు మద్దతు

కాగా, ఇటీవల మద్దతు ధర లభించడం లేదని మిర్చి రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి కేంద్రంతో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని కోరింది. అంతలోనే మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు వెళ్లి రైతులకు మద్దతు పలికారు. మొత్తం మీద ఈ క్రెడిట్ కూటమి ప్రభుత్వానిదని కొందరు అంటుండగా, మరికొందరు జగన్ పర్యటనతోనే కేంద్రం స్పందించిదని సోషల్ మీడియాలో వైరల్ చేయడం విశేషం.

Related Posts
నేడు విద్యాశాఖ అధికారులతో సీఎం భేటీ
నిర్దేశిత స‌మ‌యంలో నిర్మాణాలు పూర్తి చేయాలి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: నేడు విద్యాశాఖ అధికారులతో సీఎం భేటీ కానున్నారు. ఈ భేటీ శుక్రవారం ఉదయం బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌లో జరగనుంది. ఇందులో ప్రధానంగా Read more

Prabhas: ప్రభాస్ పీఆర్వోపై కేసు నమోదు..అసలు ఏంజరిగిందంటే..!
Prabhas: ప్రభాస్ పీఆర్వోపై కేసు నమోదు..అసలు ఏంజరిగిందంటే..!

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ,ది రాజా సాబ్ షూటింగ్ పూర్తికావొచ్చింది. అలాగే, హను రాఘవపూడి దర్శకత్వంలో Read more

ఈసీ నిష్పక్షపాతంగా ఉండే వ్యవస్థ : సీఈసీ రాజీవ్ కుమార్
EC is an impartial system .. CEC Rajeev Kumar

ఎవరైనా తప్పు చేస్తే తమ వ్యవస్థ సహించదని వెల్లడి న్యూఢిల్లీ: లోక్‌సభతో పాటు ఆయా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ డేటా తారుమారు అయిందంటూ కొంతకాలంగా విపక్షాలు Read more

JPNadda : క్యాన్సర్‌ చికిత్సకు 68 లక్షల మంజూరు : జేపీ నడ్డా
JPNadda : క్యాన్సర్‌ చికిత్సకు 68 లక్షల మంజూరు : జేపీ నడ్డా

ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజెవై) కింద ఇప్పటివరకు 68 లక్షలకుపైగా క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స అందించామనికేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మంగళవారం తెలిపారు. Read more

×