📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

UGC NET: యూజీసీ నెట్ జూన్‌ 2025 దరఖాస్తు గడువు పెంపు

Author Icon By Shobha Rani
Updated: May 9, 2025 • 3:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2025 (యూజీసీ- నెట్‌) (UGC NET) పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మే 8, 2025వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా యూజీసీ దీని దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు ప్రకటన జారీ చేసింది. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు యూజీసీ యేటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాదికి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలవగా.. ఏప్రిల్‌ 16 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమైనాయి. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు మే 8వ తేదీతో దరఖాస్తు గడువు ముగియగా.. తాజా ప్రకటన మేరకు మే 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది.

UGC NET యూజీసీ నెట్ జూన్‌ 2025 దరఖాస్తు గడువు పెంపు

తాజా గడువు పొడిగింపు
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ (యూజీసీ నెట్‌) 2025 పరీక్షను మొత్తం 85 సబ్జెక్టులకు ఆన్‌లైన్‌ (సీబీటీ) విధానంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్‌ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్‌, కంప్యూటర్ సైన్స్ అండ్‌, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, హోం సైన్స్‌, హిస్టరీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఇండియన్‌ కల్చర్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, లింగ్విస్టిక్స్‌, మ్యూజిక్‌, సైకాలజీ, లా తదితర సబ్జెక్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.
అర్హత మరియు వయోపరిమితి
సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ- ఎన్‌సీఎల్‌/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. జేఆర్‌ఎఫ్‌కు జూన్ 01, 2025 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయోపరిమితి లేదు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 12, 2025 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆన్‌లైన్‌ రాత పరీక్ష జూన్‌ 21 నుంచి 30 వరకు దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

Read Also: NEET Exam: డాక్టర్ కావాలనే కోరికతో నీట్ పరీక్ష రాసిన బామ్మా

application deadline extended Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news UGC NET June 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.