SSC CGL Tier 1 : పరీక్ష 2025 అడ్మిట్ కార్డు త్వరలో విడుదల కానుంది. ఈ అడ్మిట్ కార్డులో అభ్యర్థి పేరు, రిపోర్టింగ్ సమయం, పరీక్ష నగరం, షిఫ్ట్ వివరాలు ఉంటాయి. పరీక్ష కేంద్రంలో ప్రవేశం పొందడానికి అభ్యర్థులు ఈ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
ఈసారి SSC CGL Tier 1 పరీక్ష సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 26, 2025 వరకు జరుగనుంది. ఇప్పటికే పరీక్ష కేంద్రం వివరాలు ఉన్న సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ విడుదలయ్యాయి. మొత్తం 14,582 ఖాళీలు Group B మరియు Group C పోస్టుల కోసం భర్తీ చేయబోతున్నారు.
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in లోకి వెళ్లి “Admit Cards” సెక్షన్‌లో లాగిన్ కావాలి. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్ అవసరాలకు సేవ్ చేసుకోవాలి.
SSC CGL ద్వారా భర్తీ చేయబోయే పోస్టులలో Assistant Section Officer, Income Tax Inspector, Central Excise Inspector, Preventive Officer, Examiner Inspector, Sub-Inspector మొదలైనవి ఉన్నాయి.
ఇకపోతే SSC CHSL 2025 మరియు SSC MTS 2025 పరీక్ష తేదీలను కమిషన్ త్వరలో ప్రకటించనుంది. ముందుగా CHSL Tier 1 పరీక్షను సెప్టెంబర్ 8 నుండి 18 వరకు నిర్వహించాలని నిర్ణయించగా, CGL పరీక్షలతో తేదీలు ఢీ కొన్నందున వాయిదా వేసి అక్టోబర్ 2025లో నిర్వహించే అవకాశం ఉంది. SSC MTS 2025 పరీక్ష షెడ్యూల్ కూడా త్వరలోనే విడుదల కానుంది.
SSC ఈ ఏడాది CGL, CHSL, MTS, JE వంటి పలు నియామక పరీక్షలను ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం అభ్యర్థులు పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డుల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read also :