RRB NTPC UG 2026 Admit Card:ఫేజ్-2 CBT పరీక్షల అడ్మిట్ కార్డు విడుదల

Follow Us: Google News Daily Hunt
NTPC UG Hall Ticket
NTPC UG Hall Ticket
FONT SIZE
GET APP

RRB NTPC UG 2026 Admit Card: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) కీలక ప్రకటన చేసింది. Phase-2 CBT పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఇప్పటికే ఫేజ్-1 పరీక్షలు పూర్తికాగా, ఇప్పుడు ఫేజ్-2 పరీక్షల నిర్వహణకు బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 13 నుంచి జూన్ 20, 2026 వరకు దేశవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి సంబంధిత ప్రాంతీయ RRB వెబ్‌సైట్‌ల నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read Also:TG TET Hall Tickets Release:తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదే !

పరీక్షా షెడ్యూల్:

  • షిఫ్ట్ 1: ఉదయం 9:00 గంటల నుంచి 10:30 గంటల వరకు
  • షిఫ్ట్ 2: మధ్యాహ్నం 12:45 గంటల నుంచి 2:15 గంటల వరకు
  • షిఫ్ట్ 3: సాయంత్రం 4:30 గంటల నుంచి 6:00 గంటల వరకు

పరీక్షా విధానం:

RRB NTPC CBT-1 పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు – 100 మార్కులకు నిర్వహించబడుతుంది.

సబ్జెక్టులు:

  • మ్యాథమెటిక్స్
  • జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్
  • జనరల్ అవేర్‌నెస్

నెగెటివ్ మార్కింగ్:

  • ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు
  • ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత

RRB NTPC UG 2026 Admit Card: అభ్యర్థులకు ముఖ్య సూచనలు

RRB NTPC UG 2026 Admit Card
  • అడ్మిట్ కార్డు లేకుండా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదు.
  • హాల్‌టికెట్‌తో పాటు ఒక ఒరిజినల్ ఫోటో ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
  • పరీక్ష ప్రారంభానికి కనీసం ఒక గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
  • అడ్మిట్ కార్డులో ఉన్న వివరాలను ముందుగానే పరిశీలించుకోవాలి.

దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 3,058 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు