ట్రంప్ కు కెనడా కొత్త ప్రధాని తీవ్ర హెచ్చరిక

Donald Trump: ట్రంప్ కు కెనడా కొత్త ప్రధాని తీవ్ర హెచ్చరిక

కెనడా నూతన ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మార్క్ కార్నీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చారు. కెనడాని అమెకాలో విలీనం చేసుకుంటామని ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగం కాబోదని… పొరపాటున కూడా ఆ ఆలోచన చేయవద్దని చెప్పారు. కెనడా నూతన ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

Advertisements

అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలను కొనసాగిస్తాం

ట్రంప్ కెనడాను అమెరికాలో విలీనం చేయాలని సూచించిన నేపథ్యంలో, కార్నీ ఈ ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించారు.కెనడాపై అమెరికా గౌరవం చూపించాలని… అంతవరకు అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలను కొనసాగిస్తామని మార్క్ కార్నీ తెలిపారు. కెనడాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పదేపదే చేస్తున్న ప్రకటనలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కెనడా సార్వభౌమాధికారం పట్ల గౌరవం చూపితేనే తాను ట్రంప్ ను కలుస్తానని చెప్పారు. మరోవైపు కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీ తెలిపిన వివరాల ప్రకారం… కార్నీ-ట్రంప్ మధ్య చర్చలు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

కెనడా-అమెరికా సంబంధాలు

కెనడా-అమెరికా మధ్య వాణిజ్య, భద్రతా, సాంస్కృతిక సంబంధాలు ఉన్నప్పటికీ, రెండు దేశాలు తమ స్వతంత్రతను కాపాడుకోవడంలో నిబద్ధంగా ఉన్నాయి. కెనడా ప్రజలు తమ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలనే అభిలాషతో ఉన్నారు.

Related Posts
పుష్ప 2 తొక్కిసలాటపై ఒవైసీ వ్యాఖ్యలు
పుష్ప 2 తొక్కిసలాటపై ఒవైసీ వ్యాఖ్యలు

అల్లు అర్జున్‌ తొక్కిసలాట జరిగిన సినిమా చూసాడు: అక్బరుద్దీన్ ఒవైసీ AIMIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, హైదరాబాద్‌లో తన బ్లాక్‌బస్టర్ చిత్రం 'పుష్ప 2: ది రూల్' Read more

గాజాలో ఆరోగ్య సేవలపై ఇజ్రాయెల్ దాడులు
gaza

ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాలో ఆరోగ్య సదుపాయాలపై దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఈ దాడులలో ముఖ్యంగా ఇండోనేషియా హాస్పిటల్, కమల్ అద్వాన్ హాస్పిటల్ మరియు అల్-అవ్దా Read more

Pahalgam Attack: దాడి చేసింది పాకిస్థాన్ ఎస్‌ఎస్‌జీ కమాండోలు- మాజీ డీజీపీ
దాడి చేసింది పాకిస్థాన్ ఎస్‌ఎస్‌జీ కమాండోలు- మాజీ డీజీపీ

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడి చేసిన విధానం, అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి తరహాలో ఉందని జమ్ముకశ్మీర్‌ మాజీ డీజీపీ శేష్‌ పాల్ వైద్ అన్నారు. Read more

Trump and Zelensky: మరోసారి ట్రంప్‌, జెలెన్‌స్కీల మధ్య గొడవ!
మరోసారి ట్రంప్‌, జెలెన్‌స్కీల మధ్య గొడవ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొడిమిర్ జెలెన్‌స్కీ మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. రష్యా- ఉక్రెయిన్‌ మధ్య మూడేళ్లకుపైగా సాగుతోన్న యుద్ధం ముగింపునకు చర్చలు Read more

Advertisements
×