📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Vijaya Mallya: న్యాయమైన విచారణకు హామీనిస్తే భారత్‌కు వస్తా: మాల్యా

Author Icon By Vanipushpa
Updated: June 6, 2025 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సుమారు రూ. 9,000 కోట్లకు పైగా మోసం, మనీలాండరింగ్ ఆరోపణలతో భారత్‌లో వాంటెడ్‌గా ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా(Vijaya mallya) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పారిశ్రామికవేత్త రాజ్ షమానీ(Raj Shamanii)తో నాలుగు గంటల పాటు సాగిన ఒక పాడ్‌కాస్ట్ సంభాషణలో ఆయన తనపై ఉన్న కేసులు, వివాదాస్పద రీతిలో భారత్ విడిచి వెళ్లడం, చట్టపరమైన పోరాటాలు, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనం, తనను ‘దొంగ’ అని పిలవడం వంటి అంశాలపై స్పందించారు.

Vijaya mallya: న్యాయమైన విచారణకు హామీనిస్తే భారత్‌కు వస్తా: మాల్యా

అసలు ‘దొంగతనం’ ఎక్కడ జరిగింది?” :మాల్యా
“మార్చి (2016) తర్వాత భారత్ కు వెళ్లనందుకు నన్ను పరారీలో ఉన్న వ్యక్తి అనొచ్చు. నేను పారిపోలేదు, ముందే ఖరారైన పర్యటనలో భాగంగానే భారత్ నుంచి బయటకు వెళ్లాను. సరే, నేను సరైనవని భావించే కారణాల వల్ల తిరిగి రాలేదు, కాబట్టి మీరు నన్ను పరారీలో ఉన్న వ్యక్తి అని పిలవాలనుకుంటే పిలవండి, కానీ ‘దొంగ’ అనే మాట ఎక్కడి నుంచి వస్తోంది? అసలు ‘దొంగతనం’ ఎక్కడ జరిగింది?” అని మాల్యా పాడ్‌కాస్ట్ లో ప్రశ్నించారు. 2016 నుంచి యూకేలో నివసిస్తున్న మాల్యా విదేశాల్లో ఉండటం వల్ల తన న్యాయపరమైన చిక్కులు మరింత తీవ్రమయ్యాయా అనే అంశంపైనా వ్యాఖ్యానించారు. “భారత్ లో నాకు న్యాయమైన విచారణ, గౌరవప్రదమైన ఉనికి లభిస్తుందన్న హామీ ఉంటే మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ నాకు ఆ హామీ లేదు” అని ఆయన అన్నారు.
భారతీయ జైళ్లలోని పరిస్థితులు సరిగ్గా లేవు
న్యాయబద్ధమైన విచారణకు హామీ ఇస్తే భారత్ కు తిరిగి వస్తారా? అని ప్రశ్నించగా “నాకు అలాంటి హామీ లభిస్తే కచ్చితంగా దాని గురించి ఆలోచిస్తాను” అని మాల్యా బదులిచ్చారు. అప్పగింత కేసులో యూకే హైకోర్ట్ ఆఫ్ అప్పీల్ ఇచ్చిన తీర్పును ఆయన ఉటంకిస్తూ భారతీయ జైళ్లలోని పరిస్థితులు యూరోపియన్ మానవ హక్కుల కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 3ను ఉల్లంఘిస్తున్నాయని తేలిందని చెప్పారు. “అందువల్ల వారిని వెనక్కి పంపలేరు” అని పేర్కొంటూ తనకు కూడా అలాంటి ఆందోళనలు ఉన్నాయని పరోక్షంగా పేర్కొన్నారు. .
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంక్షోభం
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనం గురించి మాల్యా మాట్లాడుతూ 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఇందుకు ఒక ప్రధాన కారణమని తెలిపారు. “మీరు లెమాన్ బ్రదర్స్ గురించి విన్నారా? ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి విన్నారు కదా? అది భారత్ పై ప్రభావం చూపలేదా? కచ్చితంగా చూపింది” అని షమానీతో అన్నారు. “ప్రతి రంగం దెబ్బతింది.
“నేను శ్రీ ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లి నాకు ఒక సమస్య ఉందని చెప్పాను. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కార్యకలాపాలు తగ్గించుకోవాలి, విమానాల సంఖ్యను తగ్గించాలి, ఉద్యోగులను తొలగించాలి, ఎందుకంటే ఈ కుంగిపోయిన ఆర్థిక పరిస్థితుల్లో కార్యకలాపాలు కొనసాగించలేను” అని చెప్పారు. అయితే, కార్యకలాపాలు తగ్గించవద్దని, బ్యాంకులు మద్దతు ఇస్తాయని ఆయన తనకు సలహా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.
కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన మాల్యా
మాల్యాకు న్యాయపరమైన చిక్కులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 9న భారతీయ స్టేట్ బ్యాంక్ సహా భారతీయ రుణదాతల కన్సార్టియంకు చెల్లించాల్సిన రూ. 11,101 కోట్ల రుణానికి సంబంధించి లండన్ హైకోర్టు జారీ చేసిన దివాలా ఉత్తర్వులపై చేసిన అప్పీల్‌ను ఆయన కోల్పోయారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవంగా చెల్లించాల్సిన రూ. 6,200 కోట్లకు బదులుగా బ్యాంకులు ఇప్పటికే రూ. 14,000 కోట్లు రాబట్టుకున్నాయని తన న్యాయవాది ద్వారా వాదించారు. రాబట్టుకున్న మొత్తానికి సంబంధించిన వివరణాత్మక లెక్కలను అందించాలని రుణదాతలను ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఆర్. దేవదాస్ నేతృత్వంలోని ధర్మాసనం సంబంధిత బ్యాంకులకు, రుణ రికవరీ అధికారులకు నోటీసులు జారీ చేసింది.

Read Also: New Zealand: వేశ్యల‌తో పీఎంవో ఉద్యోగి ఫోన్ రికార్డింగ్‌

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu if assured of fair trial Latest News in Telugu Mallya Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Will come to India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.