📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

US: వైట్‌హౌస్‌ మీదుగా దూసుకెళ్లిన B2 బాంబర్స్‌

Author Icon By Vanipushpa
Updated: July 5, 2025 • 3:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యం అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నేడు (US Independence Day). ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రజలు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. బాణాసంచా కాలుస్తూ, కవాతుల మధ్య సందడిగా జరుపుకున్నారు. అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌(White House) లో సైతం స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా B2 స్టెల్త్‌ బాంబర్స్‌ (B2 Bombers) వైట్‌హౌస్‌ (White House) మీదుగా దూసుకెళ్లాయి. వాటికి బాల్కనీ నుంచి సతీమణి, ఫస్ట్‌లేడీ మెలానియాతో కలిసి ట్రంప్‌ (Donald Trump) సెల్యూట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని వైట్‌హౌస్‌ ఎక్స్‌ వేదికగా పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

US: వైట్‌హౌస్‌ మీదుగా దూసుకెళ్లిన B2 బాంబర్స్‌

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ (Israel-Iran) యుద్ధంలో..
అమెరికా అమ్ములపొదిలోని అత్యాధునిక, వ్యూహాత్మక ఆయుధాల్లో ఒకటి. వీటిని ఇటీవలే ఇరాన్‌-ఇజ్రాయెల్‌ (Israel-Iran) యుద్ధంలో అగ్రరాజ్యం ఉపయోగించిన విషయం తెలిసిందే. టెహ్రాన్‌లోని ఫోర్డో, నతాంజ్‌, ఇస్ఫాహన్‌లోని అణు కేంద్రాలపై జరిపిన ఈ దాడుల కోసం వీటిని ఉపయోగించింది. ఇవి అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను సైతం ఏమార్చి కచ్చితమైన దాడుల (ప్రెసిషన్‌ అటాక్స్‌)తో విరుచుకుపడగలవు.

ఒక్కో బీ-2 బాంబర్‌ ఖరీదు దాదాపు 210 కోట్ల డాలర్లు

40 వేల పౌండ్ల (18 వేల కిలోల) మందుగుండు సామగ్రిని మోసుకెళ్లగలిగే ఈ ‘రాకాసి’ యుద్ధ విమానాలు అత్యంత రక్షణ కలిగిన లక్ష్యాలను సైతం నాశనం చేయగలవు. స్టెల్త్‌ ఫీచర్లను కలిగి ఉండే ఈ బాంబర్లను గుర్తించడం, ట్రాక్‌ చేయడం, ప్రతిఘటించడం చాలా కష్టం. ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న సైనిక విమానాల్లో ఇదే అత్యంత ఖరీదైనది. ఒక్కో బీ-2 బాంబర్‌ ఖరీదు దాదాపు 210 కోట్ల డాలర్లు (రూ.18,182 కోట్లు). నార్త్‌రోప్‌ గ్రమ్మన్‌ కంపెనీ తయారు చేసిన ఈ భారీ, లాంగ్‌-రేంజ్‌ బాంబర్‌ మార్గం మధ్యలో ఇంధనాన్ని నింపుకోకుండా ఏకబిగిన దాదాపు 7 వేల మైళ్లు (11 వేల కిలోమీటర్లు), ఒకసారి రీఫ్యూయలింగ్‌తో 11,500 మైళ్లు (18,500 కిలోమీటర్లు) ప్రయాణించగలదు. ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కేవలం గంటల వ్యవధిలోనే చేరుకోగలదు.

Read Also: hindi.vaartha.com

Read Also: Trump: ట్రంప్ కఠిన టారిఫ్ వ్యూహం: వివిధ దేశాలకు కొత్త సుంకాల లేఖలు

#telugu News America national day Ap News in Telugu B-2 Spirit flyover B2 bombers flypast Breaking News in Telugu Google News in Telugu Joe Biden Independence Day July 4 celebrations USA July 4 White House event Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today US Independence Day 2025 US military parade USA patriotic events White House fireworks

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.