అమెరికా రాజ్యాంగం(American constitution) భావవ్యక్తీకరణ స్వేచ్ఛను రక్షిస్తున్నప్పటికీ, చాలామంది అమెరికన్లు తమ అభిప్రాయాలను చెప్పడానికి భయపడుతున్నారు. రాజకీయ సమీకరణ, సామాజిక వ్యతిరేకతకు భయపడి స్వీయ-నియంత్రణ పాటిస్తున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) హయాంలో ఇది మరింత పెరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆన్‌లైన్(Online)లో భావ వ్యక్తీకరణపై కూడా చాాలా సెన్సార్‌షిప్జ రుగుతోందని అమెరికన్లు వాపోతున్నారు. మీడియా(Media)పై కూడా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తోంది, భిన్నాభిప్రాయాలను గౌరవించే వాతావరణాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భావప్రకటనా స్వేచ్ఛపై ట్రంప్ దాడులు
అమెరికా రాజ్యాంగంలోని మొదటి సవరణ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను బలంగా రక్షిస్తుంది. ఇది ప్రభుత్వం.. ప్రజల ప్రసంగాలను లేదా అభిప్రాయాలను నియంత్రించకుండా నిరోధిస్తుంది. ఈ హక్కులో కేవలం మాట్లాడటం మాత్రమే కాకుండా, రాయడం, తమ అభిప్రాయాలను పంచుకోవడం, నిరసన ప్రదర్శనలు చేయడం వంటివి కూడా ఉంటాయి. వాక్ స్వాతంత్ర్యానికి ప్రతీకగా భావించే అమెరికాలోనూ, స్వీయ-నియంత్రణ (self-censorship) గణనీయంగా పెరుగుతోందని ఇటీవల సర్వేలు వెల్లడిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో భావప్రకటనా స్వేచ్ఛపై దాడులు పెరిగాయని, ఇది ప్రజల్లో భయాన్ని సృష్టిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.
సామాజిక వ్యతిరేకతకు భయపడి
అమెరికాలో పెరుగుతున్న రాజకీయ సమీకరణ (political polarization), సామాజిక వ్యతిరేకతకు భయపడి ప్రజలు రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇటీవలి పరిశోధనల ప్రకారం, దాదాపు సగం మంది అమెరికన్లు గతంలో కంటే ఇప్పుడు రాజకీయ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేకపోతున్నామని చెబుతున్నారు.
‘స్పైరల్ ఆఫ్ సైలెన్స్’ థియరీ
“స్పైరల్ ఆఫ్ సైలెన్స్” సిద్ధాంతం ప్రకారం, ఒక వ్యక్తి అభిప్రాయం చెప్పాలనుకున్నప్పుడు.. ప్రజాభిప్రాయం గురించి కూడా ఆలోచిస్తాడు. తన అభిప్రాయం వ్యక్తం చేస్తే.. విమర్శలు వస్తాయని, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని చాలా మంది అనుకుంటాడు. అలాగే ప్రస్తుతం అమెరికాలోనూ.. తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలు నచ్చని వారు.. తీవ్రమైన విమర్శలకు దిగడం, వ్యక్తిగత విమర్శలు చేయడం వంటివి చేస్తున్నందున అమెరికన్లు స్వీయ-నియంత్రణ పాటిస్తూ తమ నోరును కుట్టేసుకుంటున్నారు.
ప్రభుత్వ అణచివేత గురవుతామన్న భయం
ఈ స్వీయ-నియంత్రణకు.. తమ అభిప్రాయం వ్యక్తం చేస్తే.. ప్రభుత్వ అణచివేత గురవుతామన్న భయం కంటే స్నేహితులు, కుటుంబం, సహోద్యోగుల నుంచి దూరం అవుతామనే భయమే ప్రధాన కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి. సోషల్ మీడియా పెరుగుదల, రాజకీయ విభేదాలు ఈ భయాలను మరింత పెంచాయి. సోషల్ మీడియా రాకతో, వ్యక్తిగత అభిప్రాయాలు తరచుగా దూషణలు, విమర్శలకు గురవుతున్నాయి. దీనివల్ల చాలా మంది మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారు.
విద్యావేత్తలపైనా ప్రభావం
ఈ ప్రభావం సామాన్య ప్రజలకే పరిమితం కాలేదు. విద్యావేత్తలు సైతం వేధింపులు, రాజకీయ పర్యవసానాలకు భయపడి తమ పరిశోధనలు, బోధన, బహిరంగ సంభాషణలలో స్వీయ-నియంత్రణ పాటిస్తున్నారు. ఒక సర్వేలో.. దాదాపు మూడింట రెండు వంతుల మంది రాజకీయాల కారణంగా కొన్ని కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని తేలింది.
Read Also: NATO Defence: రష్యాతో అమీతుమీకి నాటో దేశాల సన్నాహాలు