📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Trump: ట్రంప్ కఠిన టారిఫ్ వ్యూహం: వివిధ దేశాలకు కొత్త సుంకాల లేఖలు

Author Icon By Vanipushpa
Updated: July 4, 2025 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతీకార సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా జులై 9 గడువుకు ముందే ఏకపక్షంగా నిర్ణయించిన కొత్త టారిఫ్ రేట్ల(New Tariff Rates)ను తెలియజేస్తూ ఆయన వివిధ దేశాలకు లేఖలు పంపనున్నట్లు తెలిపారు. శుక్రవారం నుంచే ఈ ప్రక్రియ మొదలుకానుందని ఆయన స్పష్టం చేశారు. దీని ప్రకారం చూస్తే, ప్రతీకార సుంకాల అమలుకు ఉన్న జులై 9 డెడ్​లైన్​ను ఇంకా పొడిగించే అవకాశాలు కనిపించడం లేదు. “అమెరికాతో వాణిజ్యం చేయాలంటే ఎంత మేర సుంకాలు (టారిఫ్​లు)(Tariff) చెల్లించాలన్న దానిపై ఆయా దేశాలకు లేఖలు పంపనున్నాం. శుక్రవారం నుంచే ఈ ప్రక్రియ రంభమవుతుంది. రోజుకు 10 దేశాలు చొప్పున ఈ టారిఫ్ లేఖలను పంపించే అవకాశం ఉంది.” అని డొనాల్డ్​ ట్రంప్ అన్నారు.

గడువు పొడిగింపునకు నో ఛాన్స్​!
ఇంతకు ముందు టారిఫ్‌లపై ఉన్న డెడ్‌లైన్‌ను పొడిగించవచ్చు లేదా కుదించవచ్చు అంటూ డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే, ఇకపై ఆ గడువు పొడిగించే అవకాశాలు లేవని తెలుస్తోంది. డొనాల్డ్​ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏక పక్షంగా ట్రేడ్ వార్ మొదలుపెట్టారు. ఏప్రిల్ 2వ తేదీన వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. ముఖ్యంగా భారత్‌, చైనా సహా పలు దేశాలపై భారీగా టారిఫ్​లు విధించారు. తరువాత ఆయా దేశాలతో ఎగుమతులు, దిగుమతుల సుంకాలపై నిర్ణయం తీసుకోవడం సహా, వాణిజ్య ఒప్పందం చేసుకోవడం కోసం 90 రోజుల గడువు (జులై 9వ తేదీ వరకు) విధించారు. అప్పటి వరకు ప్రతీకార సుంకాల అమలును తాత్కాలికంగా నిలిపివేశారు.

Trump: ట్రంప్ కఠిన టారిఫ్ వ్యూహం: వివిధ దేశాలకు కొత్త సుంకాల లేఖలు

భారత్‌, చైనా, బ్రిటన్‌ మొదలైన దేశాలు- అమెరికాతో వాణిజ్య చర్చలు

అంతేకాదు గడువులోగా యూఎస్​తో ట్రేడ్‌ డీల్‌ కుదుర్చుకోకపోతే, ఆయా దేశాలపై తమ ఇష్టానుసారం ప్రతీకార సుంకాలను విధిస్తామని ట్రంప్‌ ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించారు. దీనితో భారత్‌, చైనా, బ్రిటన్‌ మొదలైన దేశాలు- అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపాయి. ఇప్పటికే కొన్ని కొలిక్కిరాగా, భారత్‌తో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల్లోగా భారత్​-అమెరికా మధ్య మినీ ట్రేడ్‌ డీల్‌ కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చైనాతో ఒప్పందం కుదిరినట్లు ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

అమెరికా వ్యాపార ధోరణిలో మార్పు

గతంలో జులై 9 గడువును పొడిగించే అవకాశాలు ఉన్నట్లు సూచనలు ఇచ్చినప్పటికీ, తాజా ప్రకటనల ప్రకారం ఈ గడువు ఇక పొడిగించే సూచనలు లేవు. అమెరికా ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన ధోరణి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏకపక్ష చర్యలతో అమెరికా ట్రేడ్ పాలసీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇది గ్లోబల్ ట్రేడ్ పట్ల అమెరికా చూపుతున్న ఆత్మకేంద్ర ధోరణిని (protectionism) సూచిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Nuclear Deal: అమెరికాకు ఇరాన్ కఠిన షరతు – హామీ లేనిదే చర్చలే లేవు!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu China US agreement Global Trade News Google News in Telugu India US Trade Deal July 9 tariff deadline Latest News in Telugu mini trade deal with India Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Trump economic policy Trump letters to countries Trump on India tariffs Trump retaliatory tariffs Trump tariff letters Trump trade war US import export policy US new tariffs 2025 US protectionist trade US trade negotiations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.