📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Tigers: మాకు కొన్ని పులులను ఇవ్వండి

Author Icon By Vanipushpa
Updated: June 30, 2025 • 5:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్రకు తెలంగాణ రిక్వెస్ట్
తెలంగాణ విజప్తికి అంగీకారం

హైదరాబాద్: తెలంగాణలోని కవ్వాల్ ప్రాంతంలో ఉన్న పెద్ద పులుల అభయా రణ్యం (టైగర్ రిజర్వు ఫారెస్ట్)లో ప్రస్తుతం ఒక్క పులి కూడా లేకపోవడంతో మహారాష్ట్ర(Maharstra)లోని తాడోబా(Taadobaa) అభయారణ్యం నుంచి పులులను కవ్వాలు తీసుకు రానున్నారు. ప్రాజెక్ట్ టైగర్ (Project Tiger)పేరుతో రాష్ట్ర అటవీ శాఖ చేపట్టే ఈ ప్రాజెక్టుకు సహకరించేందుకు మహారాష్ట్ర అంగీకారం తెలిపింది. దీనిపై క్షేత్ర పరిశీలన కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్ఐసిఎ) అధికారులు జులై తొలి వారంలో కవ్వాల్కు రానున్నారు. కవ్వాల్లో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. 13 ఏళ్ల కిందట ఇక్కడ అభయారణ్యం(Forest) ఏర్పాటు చేశారు. పులులు వేటాడి తినేందుకు జింకలు, సాంబర్, నీల్గాయి వంటి జంతువులు అక్కడ ఉన్నాయి. అడపాదడపా మహారాష్ట్రనుంచి కవ్వాల్కు ఒకటిరెండు పెద్దపులులు వస్తున్నా, ఒంటరితనంతో తిరిగి వెళ్లిపోతున్నాయి. దీనికి భిన్నంగా మహారాష్ట్రలో భారీసంఖ్యలో పులులు న్నాయి. ఆసిఫాబాద్కు సరిహద్దులో ఉన్న తాడోబా టైగర్ రిజర్వులో 40కి పైగా, ఆదిలాబాద్ పక్కనే ఉన్న ఇంద్రావతి నేషనల్ పార్కులో 20కి పైగా ఉన్నాయి.

Tigers: మాకు కొన్ని పులులను ఇవ్వండి

ప్రజలు ఖాళీ చేసిన పాత గ్రామాల ప్రాంతానికి పెద్ద పులుల్ని తరలించనున్నారు.
ఈ నేపథ్యంతో అక్కడున్న పెద్ద పులులను ఇక్కడికి తరలించాలని తెలంగాణ అటవీశాఖ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలూసింగ్ మేరు, మహారాష్ట్ర చీఫ్ వైల్డైఫ్ వార్డెనన్ను ఇటీవల కోరగా సుముఖత తెలిపారు. తదుపరి అనుమతుల కోసం రాష్ట్ర అటవీ శాఖ ఎన్టీసీఏకు లేఖ రాసింది. మహారాష్ట్ర నుంచి కనీసం ఒక మగ పులి, రెండుఆడ పులులు సహా గరిష్ఠంగా 5 పులులు కావాలని రాష్ట్ర అటవీ శాఖ కోరినట్లు సమా చారం. రెండేళ్లు పైబడిన పులులు స్వతంత్రంగా సంచరిస్తాయి. అలాంటివే తమకు కావాలని మహారాష్ట్రను తెలంగాణ కోరింది.

పెద్దపులులకు ఆవాసం కోసం..

పెద్దపులులకు ఆవాసం కోసం కవ్వాల్ కోర్ ఏరి యా నుంచి మైసంపేట, రాంపూర్ ఊర్ల ప్రజలను 20 కి.మీ. దూరంలోని ప్రాంతానికి తరలించారు. ప్రజలు ఖాళీ చేసిన పాత గ్రామాల ప్రాంతానికి పెద్ద పులుల్ని తరలించనున్నా రు. ఒక అడవిలో ఎక్కువగా ఉండే పులుల్ని, వాటి సంఖ్య లేని మరో అరణ్యంలోకి తీసుకెళ్లడాన్ని టైగరీ లొకేషన్ అంటారు. గతంలో మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వులో ఇలాగే చేశారు. అక్కడ 2009 నాటికి ఒక్క పెద్దపులి కూడా లేదు. దీంతో అదే రాష్ట్రంలోని అడవుల నుంచి 4 పులులను పన్నా రిజర్వుకు తరలించగా, ప్రస్తుతం పన్నాలో పెద్ద పులుల సంఖ్య 50 దాటింది. అయితే కవ్వాల్ రిజ ర్వు ఫారెస్టు విస్తీర్ణం: 2015.39 చ.కిమీ. కాగా ఏర్పాటు 2012లో మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్లకు విస్తరించింది.

Read Also: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు

#telugu News animal welfare Ap News in Telugu big cats Breaking News in Telugu endangered species Forest Department Google News in Telugu Latest News in Telugu Paper Telugu News request for tigers save tigers Telugu News online Telugu News Paper Telugu News Today tiger conservation tiger population tiger relocation tiger rescue tiger reserve Let me know if you want these o tiger transfer Tigers wildlife protection wildlife request

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.