📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Jain: అతిపెద్ద జైన వ్యాపార సమ్మేళనానికి రంగం సిద్ధం

Author Icon By Vanipushpa
Updated: June 7, 2025 • 5:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్(Hyderabad), భారతదేశం(India)లో అతిపెద్ద జైన వ్యాపార సమ్మేళనానికి రంగం సిద్ధమైంది. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జితో) అధ్వర్యంలో ‘జితో కనెక్ట్ 2025’ పేరుతో హైటెక్స్‌, హెచ్ఐసీసీలో అక్టోబర్ 3 నుంచి 5వ తేదీ వరకు ఈ సమ్మేళనం జరగనుంది. అందులో భాగంగా ఈరోజు మాదాపూర్ లో గల నోవాటల్ లో కర్టెన్ రైజర్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ షోతో పాటు ‘బ్రైడల్ స్టోరీ’ నిర్వహించారు. ఫ్యాషన్ షోకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. మోడల్స్ ర్యాంప్ పై చేసిన వాక్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ వేడుకలో జితో బిజినెస్ నెట్‌వర్క్ కింద బిజ్ కనెక్ట్, జితో గోల్ఫ్ కప్, జైన్ పావిలియన్‌లను ప్రారంభించారు.

Jain: అతిపెద్ద జైన వ్యాపార సమ్మేళనానికి రంగం సిద్ధం

స్టాళ్ల బుకింగ్‌లు, స్పాన్సర్‌షిప్
ఈ సందర్భంగా స్టాళ్ల బుకింగ్‌లు, స్పాన్సర్‌షిప్ అవకాశాలను అధికారికంగా ప్రారంభించారు. జితో హైదరాబాద్ చాప్టర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ ‘ది బ్రైడల్ స్టోరీ’ని ప్రారంభించారు. జితో లేడీస్ వింగ్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక వివాహ ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా పర్యటించనుంది. ఇందులో డిజైనర్లు దీప్తి రెడ్డి, వ్రికీ అంగ్రిష్, రోజీ అహ్లువాలియా, పల్లవి జైపూర్ తమ డిజైన్‌లను ప్రదర్శిస్తున్నారు. జితో కనెక్ట్ గేమ్-చేంజింగ్ వేడుకగా నిలవనుంది. ఈ కార్యక్రమానికి హాలిడే బజార్ టైటిల్ స్పాన్సర్‌గా, శివరాజ్ లక్ష్మీచంద్ జువెల్లర్స్ జువెలర్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నాయి. ఈ సమ్మేళనం యువత, ఆవిష్కరణ, భవిష్యత్తు అనే థీమ్ ఆధారంగా నిర్వహించనున్నారు.


వెయ్యికి పైగా వ్యాపార స్టాల్స్
ఈ సందర్భంగా జితో అపెక్స్ చైర్మన్ పృథ్వీరాజ్ ఎస్ కొఠారి మాట్లాడుతూ ఎనిమిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సమ్మేళనం జరగనుందన్నారు. వెయ్యికి పైగా వ్యాపార స్టాల్స్ ఉంటాయన్నారు. రెండు లక్షలకు పైగా సందర్శకులు విచ్చేయనున్నారన్నారు. యాబై వేలకు పైగా చేంజ్‌మేకర్స్ పాల్గొననున్నారని వివరించారు. అంతర్జాతీయ స్థాయి స్పీకర్లు, స్టార్టప్ ప్రదర్శనలు, నెట్‌వర్కింగ్ ఫోరమ్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సమ్మేళనాన్ని ప్రత్యేకంగా మలిచేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆర్థిక సుస్థిరత, విద్య, సేవ అనే మూడు విభాగాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. వ్యాపార వృద్ధికి, ఆర్థిక బలోపేతానికి కొత్త ప్రమాణాలు సృష్టించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. పురుషులు, మహిళలు, యువత ఇలా ప్రతిభ కలిగిన అందరికి జితో నెట్‌వర్కింగ్ ద్వారా అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. వ్యాపార విజయానికి కావల్సిన నూతన ఆవిష్కరణలు, సహకారం, చక్కటి ఫలితాల దిశగా పురోగమించేలా ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈ ఈవెంట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్‌లు (జేఐఐఎఫ్, జేఐటీఈఎం), విభాగాలవారీగా ఫోకస్ జోన్లు ముఖ్య ఆకర్షణగా ఉండనున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జితో అపెక్స్ అధ్యక్షుడు విజయ్ బండారి, జనరల్ సెక్రటరీ లలిత కుమార్ డాంగీ, జితో హైదరాబాద్ చైర్మన్ రోహిత్ కొఠారి, కోశాధికారి విశాల్ అంచలియా, టీఎన్ఏపీటీఎస్ జోన్ వైస్ చైర్మన్, జితో కనెక్ట్ కన్వీనర్‌ బీఎల్ బండారి, జితో కనెక్ట్ కో కన్వీనర్‌ సుశీల్ సంచేతి, ఈవెంట్ కోఆర్డినేటర్లు రోనక్ సింఘీ, అన్కిత్ భుటోరియా పాల్గొన్నారు.

Read Also: Bihar: సస్పెండ్ అయిన బిహార్​ పోలీస్​ ఇంట్లో భారీ ఆయుధాలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu business conclave Google News in Telugu largest Jain Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today The stage is set

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.