📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Suzuki e-access: సుజుకీ నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్

Author Icon By Vanipushpa
Updated: June 3, 2025 • 5:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఈ ఏడాది జనవరిలో భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. దీనిలోనే సుజుకీ(Sizilo) కంపెనీ తన ఇ-యాక్సెస్‌(e-access)ను ప్రదర్శనకు ఉంచింది. ఆ కంపెనీ ఇప్పటికే యాక్సెస్‌ పేరుతో ఐసీటీ వెర్షన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ స్కూటర్‌కు ప్రజల నుంచి ఎంతో ఆదరణ లభించింది. దీంతో ఆ పేరునే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కు తీసుకున్నారు. అయితే ఇ-యాక్సెస్‌ (ఎలక్ట్రిక్‌) స్కూటర్‌కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

సుజుకీ నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్

ఎల్‌ఈడీ డేటైమ్‌ రన్నింగ్‌ లాంప్‌
ఇ-యాక్సెస్‌ స్కూటర్‌ ఆధునిక లుక్‌తో అత్యద్భుతంగా కనిపిస్తోంది. ముందు సన్నని ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్‌ ఏర్పాటు చేశారు. అప్రాన్‌పై నిలువుగా ఎల్‌ఈడీ డేటైమ్‌ రన్నింగ్‌ లాంప్‌ అమర్చారు. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన అల్లాయ్‌ వీల్స్‌, పొడవైన సీటు, వెనుక భాగంలో డ్యూయల్‌ టోన్‌ కలర్‌ డిజైన్‌ ఆకట్టుకుంటున్నాయి. పెర్ల్‌ గ్రేస్‌ వైట్‌, మెటాలిక్‌ మ్యాట్‌ బోర్డయక్స్‌ రెడ్‌, మెటాయిక్‌ పైబ్రోయిన్‌ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది.
ట్రాఫిక్‌ రద్దీలో చాలా సులభంగా నడిపేలా ..
నగరంలోని ట్రాఫిక్‌ రద్దీలో చాలా సులభంగా నడిపేలా ఈ స్కూటర్‌ను రూపొందించారు. ఇది గరిష్టంగా 5.49 బీహెచ్‌పీ శక్తిని, 15 ఎన్‌ఎం టార్కును విడుదల చేస్తుంది. దీనిలో ఏకో, రైడ్‌ ఏ, రైడ్‌ బి అనే మూడు రైడింగ్‌ మోడ్‌ లు ఉన్నాయి. ఈ స్కూటర్‌లో 3.072 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌ ఏర్పాటు చేశారు. సింగిల్‌ చార్జింగ్‌పై సుమారు 95 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని అంచనా. సుజుకి సొంత యాజమాన్య కనెక్టర్‌ను ఉపయోగించి చార్జింగ్‌ చేసుకోవచ్చు. పోర్టబుల్‌ ఏసీ చార్జర్‌తో 4.30 గంటల్లో సున్నా నుంచి 80 శాతం చార్జింగ్‌ అవుతుంది. ఇ-యాక్సెస్‌ డీసీ చార్జింగ్‌తో సున్నా నుంచి 80 శాతం చార్జింగ్‌ను కేవలం 1.12 గంటల్లో చేసుకోవచ్చు. అలాగే 2.12 గంటల్లో సున్నా నుంచి వంద శాతం చేసుకునే వీలుంది.
ఈ-యాక్సెస్ లో సీటు కింద స్టోరేజీ ఏర్పాటు చేశారు. యూఎస్ బీ పోర్టు, క్యూబీ స్పేస్, మల్టీ ఫంక్షన్ స్టార్టర్ నాబ్ ఉన్నాయి. వీటిలో సీటును తెరవొచ్చు, ఆన్ చేయవచ్చు. చార్జింగ్ ఫ్లాప్ ను ఓపెన్ చేసుకోవచ్చు. సుజుకి బ్యాక్ ఫంక్షనాలిటీతో కీలెస్ సిస్టమ్ ను అందిస్తుంది. స్టార్ట్ ఫోన్ కనెక్టివిటీతో కూడిన టీఎఫ్ టీ ఎల్సీడీ డిస్ ప్లే, ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ స్పీడో మీటర్, బ్యాటరీ స్థాయి, ఓడోమీటర్, క్లాక్, వోల్టమీటర్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.

Read Also: Tesla: భారత్ లో కార్ల తయారీ చేయడం ఎలాన్ మస్క్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Suzuki Telugu News online Telugu News Paper Telugu News Today The first electric scooter Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.