📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Suprem Court: పథకాలకు సీఎం పేర్లు పెట్టకూడదు: మద్రాస్ హైకోర్టు తీర్పును కొట్టేసిన కోర్టు

Author Icon By Vanipushpa
Updated: August 6, 2025 • 5:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల తమిళనాడు(Tamilnadu)లోని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో సీఎం పేర్లు, ఫొటోలు వాడే అంశంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు(Suprerm Court) సంచలన తీర్పునిచ్చింది. గతంలో ఈ వ్యవహారంపై మద్రాసు హైకోర్టు(Court) ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం ఖండించింది. ప్రభుత్వ స్కీమ్స్‌(Govt Secheme)లో ముఖ్యమంత్రులు, ప్రధాని ఫొటోలను వినియోగించే పాలసీని దేశమంతటా అనుసరుస్తారని స్పష్టం చేసింది. రాజకీయ పోరాటాల కోసం కోర్టులను వాడుకోవద్దని హెచ్చరించింది.
‘ విత్‌ యు స్టాలిన్’
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని అక్కడి ప్రభుత్వం ‘ విత్‌ యు స్టాలిన్’ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ఈ స్కీమ్ ఉద్దేశం. అయితే దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.సంక్షేమ పథకాలకు సీఎంల పేర్లు, ఫొటోలు వాడటం ఏంటని ప్రశ్నించాయి. దీంతో అన్నాడీఎంకే పార్టీ నేత సీవీ షణ్ముగం ఈ వ్యవహారంపై మద్రాసు హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కొత్తగా తీసుకొచ్చే సంక్షేమ పథకాల్లో జీవించి ఉన్న నేతల పేర్లు వాడుకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Suprem Court: పథకాలకు సీఎం పేర్లు పెట్టకూడదు: మద్రాస్ హైకోర్టు తీర్పును కొట్టేసిన కోర్టు

జస్టిస్ బీఆర్‌ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ
మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తమిళనాడు సర్కార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్‌ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ చేసింది. సంక్షేమ పథకాలను చాలా రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల పేర్లతో అమలు చేస్తున్నారని.. దీనిపై న్యాయపరంగా ఎలాంటి నిషేధాలు లేవని తమిళనాడు ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం మద్రాసు హైకోర్టులో దీనిపై పిల్ వేసిన పిటిషనర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది.
మీ రాజకీయ పోరాటాల కోసం కోర్టులను వాడుకోవద్దు
పలు ప్రభుత్వ స్కీమ్స్‌కు ప్రధాని, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తుల ఫొటోలు వాడుకోవచ్చని సుప్రీంకోర్టు గతంలోనే పర్మిషన్ ఇచ్చినట్లు ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని పాటిస్తున్నారని.. మీ రాజకీయ పోరాటాల కోసం కోర్టులను వాడుకోవద్దని తేల్చిచెప్పింది. ఈ మేరకు మద్రాసు హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. అలాగే దీనిపై పిటిషన్ వేసిన అన్నాడీఎంకే నేత షణ్ముగంకు రూ.10 లక్షల జరిమానా వేసింది. వారం రోజుల్లోగా తాము జరిమానా విధించిన సొమ్మును ప్రభుత్వానికి ఇవ్వాలని ఆయనకు ఆదేశించింది. అలాగే ఆ సొమ్మును పేద ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. సుప్రీంకోర్టు తీర్పును డీఎంకే శ్రేణులు స్వాగతించారు.

సుప్రీంకోర్టు వివరాలు ఏమిటి?
చరిత్ర | భారత సుప్రీంకోర్టు | భారతదేశం
భారత రాజ్యాంగం ప్రకారం భారత సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ సంస్థ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 “భారత సుప్రీంకోర్టు ఉంటుంది” అని పేర్కొంది.
సుప్రీంకోర్టు పాత్ర ఏమిటి?
సుప్రీంకోర్టు అధికారాలు మరియు విధులు | GeeksforGeeks
సుప్రీంకోర్టు ఒక దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత న్యాయస్థానంగా పనిచేస్తుంది, ప్రధానంగా చట్టం యొక్క తుది మధ్యవర్తిగా పనిచేస్తుంది. దీని కీలక పాత్రలలో రాజ్యాంగాన్ని వివరించడం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/satya-nadella-reacts-to-team-india-victory/sports/526415/

CM Scheme Naming Government Schemes Indian Politics Judicial Verdict Madras High Court Political Neutrality Public Policy Supreme Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.