Stock Market: ఊగిసలాటలో స్టాక్ మార్కెట్‌

Read Time:  1 min
Stock Market: ఊగిసలాటలో స్టాక్ మార్కెట్‌
FONT SIZE
GET APP

దేశీయ మార్కెట్ (Stock Market) సూచీలు గురువారం లాభాలతో రోజును మొదలుపెట్టాయి. బుధవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, అలాగే ఆసియా మార్కెట్లలో అదే ధోరణి కనిపించడం వల్ల భారత మార్కెట్లపై (Stock Market) ఒత్తిడి కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సూచనలు మన మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. తొలుత సూచీలు లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టినప్పటికీ.. కాసేపటికే అవి నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ వెంటనే మళ్లీ లాభాల్లోకి వెళ్లాయి.
లాభాల్లో ప్రారంభం… వెంటనే నష్టాలు… మళ్లీ లాభాల్లోకి..
ఉదయం 9.34 గంటల సమయంలో నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 25,463 వద్ద, సెన్సెక్స్‌ (Sensex) 36 పాయింట్లు పెరిగి 83,446 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీ (Nifty)సూచీలో ఏషియన్ పెయింట్స్‌, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. కొటక్‌మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ట్రెంట్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ స్టాక్స్‌ నష్టాల్లో కదలాడుతున్నాయి.

Stock Market: ఊగిసలాటలో స్టాక్ మార్కెట్‌
ఊగిసలాటలో స్టాక్ మార్కెట్‌

Read Also: Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

Shobha Rani

రచయిత గురించి

Shobha Rani

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.