📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Stock Market: మార్కెట్ల లాభాల జోరు..

Author Icon By Vanipushpa
Updated: June 27, 2025 • 4:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ స్టాక్ మార్కెట్ల(Stock market)లో లాభాల పరంపర నాలుగో రోజు కూడా కొనసాగింది. ప్రపంచ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడులు మరింతగా పెరుగుతాయన్న అంచనాలు సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ముఖ్యంగా రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి కీలక షేర్ల(Shares) లో మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ (BSC Sensex)మరోసారి 84 వేల మార్కును అధిగమించగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 25,600 పైన ముగిసింది.

Stock Market: మార్కెట్ల లాభాల జోరు..

రోజంతా సానుకూలంగానే కదలాడిన సూచీ
ట్రేడింగ్ వివరాల్లోకి వెళితే, ఈ ఉదయం సెన్సెక్స్ 83,774 పాయింట్ల వద్ద దాదాపు ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఆరంభంలో కాస్త ఒడుదొడుకులకు లోనైనప్పటికీ, కొద్దిసేపటికే పుంజుకుని లాభాల బాట పట్టింది. రోజంతా సానుకూలంగానే కదలాడిన సూచీ, ఇంట్రాడేలో 84,089పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు, క్రితం ముగింపుతో పోలిస్తే 303 పాయింట్ల లాభంతో 84,058 వద్ద స్థిరపడింది. మరోవైపు, నిఫ్టీ కూడా 88 పాయింట్లు పెరిగి 25,637 వద్ద ముగిసింది.
లాభపడిన వాటిలో ..
సెన్సెక్స్ 30 షేర్లలో ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ప్రధానంగా లాభపడిన వాటిలో ఉన్నాయి. అయితే ట్రెంట్, ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలను చవిచూశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.48 వద్ద కొనసాగుతోంది.

Read Also: Oman: ఒమన్ లో ధనవంతులకు 5 శాతం ఇన్ కమ్ ట్యాక్స్

#BSE #Nifty #NSE #telugu News Ap News in Telugu Breaking News in Telugu equity market financial news Google News in Telugu Indian stock market Latest News in Telugu Market trends today Paper Telugu News sensex share market stock market stock market analysis stock market crash stock market forecast stock market live Stock market news Stock Market Today stock market updates stock prices stock tips stock trading Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.