📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Shravan Kumar: టీజీ పోలీసులు, అధికారుల తీరుపై దాసోజు శ్రావణ కుమార్ కీలక వ్యాఖ్యలు?

Author Icon By Anusha
Updated: July 3, 2025 • 5:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మంత్రుల ఆదేశాలతో పోలీసులు నిర్దోషులపై

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి దాసోజు శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ (Siddharth Kaushal) రాజీనామా చేసిన పరిణామాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణలోని పోలీసుల.అధికారుల తీరుపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు.ఏ కర్మ అయితే మనం ఇక్కడ చేస్తామో, ఆ ఫలితాన్ని కూడా మనమే ఇక్కడే అనుభవించాల్సి ఉంటుంది’ ఈ మాటలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ముఖ్యమంత్రి, మంత్రుల ఆదేశాలతో పోలీసులు నిర్దోషులపై అక్రమ కేసులు పెట్టి, వారిని రాజకీయంగా వేధిస్తే, అది వారి భవిష్యత్తును వారే నాశనం చేసుకున్నట్లేనని దాసోజ్ శ్రవణ్ హెచ్చరించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేస్తూ డీజీపీకి లేఖ పంపారు.

ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ చర్యలు

వ్యక్తిగత కారణాల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఎలాంటి ఒత్తిళ్లూ లేవని ఆయన స్పష్టం చేసినప్పటికీ ఈ రాజీనామా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల ఎస్పీగా పనిచేసిన కౌశల్, రాజీనామా చేసే సమయానికి డీజీపీ కార్యాలయంలో ఎస్పీగా ఉన్నారు. అయితే, దాసోజ్ శ్రవణ్ (Dasoj Shravan) మాత్రం ఈ రాజీనామాను రాజకీయ ఒత్తిళ్ల ఫలితంగానే చూస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ చర్యలు భవిష్యత్తులో ఏర్పడే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక మార్గాన్ని చూపుతాయని ఆయన వ్యాఖ్యానించారు.దాసోజ్ శ్రవణ్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం, తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో సంబంధం ఉన్న కొందరు అధికారులు, కార్యకర్తలపై జరుగుతున్న ‘వేధింపులు’.

రాజకీయ నాయకుడికి

ముఖ్యంగా టీ న్యూస్ కార్యాలయంలో పోలీసుల విచారణ వీడియోలు సీఎం ఛానెల్‌కు ఎలా లీక్ అయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఇది చట్టబద్ధమైన చర్య కాదని, రాజకీయ కుతంత్రానికి సంకేతమని దాసోజ్ శ్రవణ్ ఆరోపించారు. సీఎం చెప్పాడని, మంత్రి ఆదేశించాడని అరాచకం సృష్టిస్తే, మూడేళ్ల తర్వాత అదే అధికారులు, పోలీసులు కూడా రాజీనామా చేసే దుస్థితి వస్తుందన్నారు.పోలీసులు, అధికారులు రాజ్యాంగానికి మాత్రమే విధేయులు కావాలి కానీ, ఏ రాజకీయ నాయకుడికి లేదా పార్టీ (Party) కి బానిసలు కారు అని దాసోజ్ శ్రవణ్ పునరుద్ఘాటించారు. బ్లూ బుక్, సర్వీస్ కండక్ట్ రూల్స్ వంటివి చట్టపరంగా వారి రక్షణ కోసమే రూపొందించబడ్డాయని, అవి ప్రజాసేవకులుగా వారి పాత్రను నిబద్ధతతో నిర్వహించడానికి ఉద్దేశించినవని ఆయన గుర్తుచేశారు.

ప్రస్తుతం ఇతరుల చరిత్రలో చూస్తున్న

ఈ నియమాలను తుంగలో తొక్కి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే, అందుకు వారే బాధ్యులు అవుతారని హెచ్చరించారు. బాధ్యతతో, రాజ్యాంగ నిబంధనలకు (constitutional provisions) కట్టుబడి, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. లేకపోతే, ప్రస్తుతం ఇతరుల చరిత్రలో చూస్తున్న దుర్మార్గ గాథలు రేపు వారి పేర్లతోనే నిలిచిపోతాయని తీవ్రంగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో, పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read Hindi: hindi.vaartha.com

Read Also: Farmers: రైతన్నలను వదలని సైబర్ నేరగాళ్లు

accountability in administration Andhra Pradesh DGP letter AP IPS resignation politics Ap News in Telugu AP Telangana political developments Breaking News in Telugu BRS leader reacts BRS MLC Sravan Dasoju Sravan Kumar statement Google News in Telugu IPS officer resignation IPS resignation controversy Latest News in Telugu Paper Telugu News police harassment allegations police under political pressure political future consequences political pressure on officers political victimization Siddharth Kaushal resignation Sravan Kumar tweet Sravan Kumar warns police Telangana governance criticism Telangana police misuse Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news wrongful cases by police

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.