📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

StockMarket: ఇవాళ దుమ్మురేపిన సెన్సెక్స్, నిఫ్టీ

Author Icon By Vanipushpa
Updated: April 16, 2025 • 5:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈరోజు స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఉదయం ప్రారంభమైనప్పటి నుండి సెన్సెక్స్, నిఫ్టీ గ్రీన్, రెడ్ మార్క్ మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉన్నాయి. అయితే, చివరి గంటలో స్టాక్ మార్కెట్ కోలుకొని లాభాల్లో స్థిరపడింది. దింతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ 288.99 పాయింట్లు పెరిగి 77,023.88 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 108.65 పాయింట్లు పెరిగి 23,437.20 వద్ద ముగిసింది. కాగా నిన్న కూడా స్టాక్ మార్కెట్లో భారీ పెరుగుదల నమోదైంది.

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలపై 90 రోజుల వాయిదా విధించాక, చైనాతో అమెరికా వివాదం మరింత ముదిరింది. ఈ రెండు దేశాలు రోజురోజుకు ఒకరిపై ఒకరు కొత్త సుంకాలు ప్రకటిస్తున్న తరుణంలో తాజాగా అమెరికా చైనాపై సుంకాన్ని 245%కి పెంచింది. దింతో బోయింగ్ సహా అమెరికన్ కంపెనీలతో వ్యాపారాన్ని చైనా నిషేధించింది. హాంకాంగ్ కూడా ఇకపై అమెరికాకు వచ్చే లేదా అక్కడి నుండి వెళ్లే పార్శిళ్లను నిర్వహించబోమని ప్రకటించింది. 800 డాలర్ల కంటే తక్కువ ధర గల ప్యాకేజీలకు అమెరికాలోకి ప్రవేశానికి మినహాయింపును రద్దు చేయాలన్న ట్రంప్ నిర్ణయం దృష్ట్యా హాంకాంగ్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. అంతేకాక అమెరికా అన్యాయంగా ప్రవర్తిస్తోందని హాంకాంగ్ ఆరోపిపించింది. దీనివల్ల వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతుందనే భయం పెరిగింది.
లాభాల బుకింగ్
గత రెండు రోజులుగా స్టాక్ మార్కెట్ భారీ పెరుగుదలను చూసింది, దింతో పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియో వాల్యూని పెంచింది. కానీ లాభాల కోసం పెట్టుబడిదారులు కొన్ని షేర్లను విక్రయించగా స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్న్ ప్రభావితమైంది. గత సంవత్సరం అక్టోబర్ నుండి షేర్ మార్కెట్ పెట్టుబడిదారులను చాలా ఇబ్బందులకు గురిచేసింది, అలాగే మార్కెట్ పెద్ద ఎత్తున దూసుకుపోయినప్పుడల్లా, పెట్టుబడిదారులు లాభాలను అందుకుంటున్నారు. బలహీనంగా ప్రపంచ సంకేతాలు: ప్రపంచ మార్కెట్ల నుండి బలహీనమైన సంకేతాలు భారత మార్కెట్ల కదలికలను కూడా ప్రభావితం చేశాయి. ఏప్రిల్ 15న అంటే నిన్న US మార్కెట్ క్షీణతతో ముగిసింది. అమెరికా ప్రధాన సూచీలు నాస్‌డాక్ 0.049%, ఎస్ అండ్ పి 500 0.17%, డౌ జోన్స్ 0.38% పడిపోయాయి. ఇవన్నీ అమెరికన్ మార్కెట్లో డోనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాలకు సంబంధించి అనిశ్చితి ఇప్పటికీ కొనసాగుతుందని చూపిస్తుంది. ఇది కాకుండా ఇతర ఆసియా మార్కెట్లు కూడా ఒత్తిడిలో ఉన్నాయి.
బలహీనంగా ఎస్‌ఎస్‌ఇ కాంపోజిట్
జపాన్‌కు చెందిన నిక్కీ 225, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి, హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్, తైవాన్‌కు చెందిన టైక్స్, చైనాకు చెందిన ఎస్‌ఎస్‌ఇ కాంపోజిట్ బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఇక సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు ఎగిశాయి. మరోవైపు మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ, ఎన్టీపీసీ షేర్లు మాత్రం కాస్త వెనుకబడ్డాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు స్థిరంగా ఉండగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Read Also: Parliament : పార్లమెంట్‌లో తెలంగాణ ఎంపీల అటెండెన్స్.. టాప్‌లో ఉంది ఎవరంటే !

#Nifty #telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu hit rock bottom today Latest News in Telugu Paper Telugu News sensex Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.