📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Pakistan: చైనాతో తీవ్ర నిరాశ.. అమెరికా వైపు మొగ్గు చూపుతున్న పాక్‌!

Author Icon By Vanipushpa
Updated: July 4, 2025 • 11:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు తమ వద్ద ఉన్నాయని, భారత వైమానిక, క్షిపణి దాడులను అవి అడ్డుకుంటాయని బీరాలు పలికిన పాకిస్థాన్‌(Pakistan)కు ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor)తో చుక్కెదురైంది. చైనా(China) సరకును నమ్ముకుని భంగపడ్డ పాకిస్తాన్‌ ఇప్పుడు అమెరికా వైపు చూస్తోంది. భారత్‌(India) చేసిన దాడులను చైనా(China) గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేకపోవడం వల్ల అగ్రరాజ్యంతో రక్షణ సంబంధాల బలోపేతం దిశగా పాక్‌ అడుగులు వేస్తోంది. అమెరికాలో పాక్‌ సైనికాధికారులు వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే F-16 ఫైటర్ జెట్‌లు, గగనతల రక్షణ వ్యవస్థలను అమెరికా నుంచి కొనుగోలు చేయాలని పాక్‌ యోచిస్తోందని తెలుస్తోంది.

పాకిస్తాన్‌ ఎయిర్‌ చీఫ్‌ అమెరికా పర్యటన

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్‌ మునీర్ అమెరికాలో ఇటీవల పర్యటించారు. మునీర్ అలా అమెరికా వెళ్లి వచ్చారో లేదో, పాక్‌ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ జహీర్‌ అహ్మద్‌ బాబర్ సిద్దు సైతం తాజాగా అగ్రరాజ్యానికి వెళ్లారు. ఆపరేషన్ సిందూర్‌ తర్వాత యూఎస్‌తో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఈ వరుస పర్యటనలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఎయిర్‌ మార్షల్, యూస్ మిలిటరీ, ఇతర నాయకులతో సమావేశమయ్యారు.

రక్షణ సంబంధాల బలోపేతమే లక్ష్యం

రక్షణ సంబంధాల బలోపేతమే లక్ష్యం

చైనా పరికరాల విశ్వసనీయతపై ఆందోళనల నేపథ్యంలో అమెరికాకు చెందిన అధునాతన ఆయుధాలు, వ్యవస్థలతో తమ వైమానిక దళాన్ని ఆధునీకరించడంపై పాక్‌ దృష్టి సారించినట్లు తెలుస్తోంది F-16 ఫైటర్ జెట్‌లు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఎయిర్‌-టు-ఎయిర్‌ మిస్సైల్‌ ఎయిమ్‌-7 స్పారో వంటి వాటిని కొనుగోలు చేయాలని పొరుగుదేశం యోచిస్తోందని తెలుస్తోంది.

అమెరికా వర్గాల్లో పాక్‌పై సందేహాలు

చైనా నుంచి కొనుగోలు చేసిన HQ-9, LY-80 వ్యవస్థలు, వాటి రాడార్లు భారత్‌ ప్రయోగించిన క్షిపణులను ఆపలేకపోయాయి. అయితే, దశాబ్దాలుగా చైనాతో పాక్‌ స్నేహంగా వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా సైనిక ఉన్నతాధికారులు, రాజకీయ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. అయినప్పటికీ అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో పాక్‌ సైనికాధికారులు అగ్రరాజ్యం అమెరికాలో అధికారిక పర్యటనలు చేస్తున్నారు.
దశాబ్దాలుగా చైనాతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్న పాకిస్తాన్‌పై, అమెరికా రాజకీయ వర్గాలు, రక్షణ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా, వాతావరణాన్ని మెల్లగా మార్చేందుకు పాక్‌ అధికారం ప్రతినిధులు దౌత్యపూర్వకంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Dalai Lama : వారసుడి ఎంపిక ప్రక్రియ దలైలామా చేతుల్లోనే ఉంది : భారత్‌

#telugu News AIM-7 Sparrow missiles Ap News in Telugu Breaking News in Telugu F-16 deal Pakistan Google News in Telugu HQ-9 failure Latest News in Telugu LY-80 radar issue Operation Sindoor Pakistan Air Chief US visit Pakistan China missile defense failure Pakistan military modernization Pakistan US defense ties Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today US Pakistan strategic relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.